మట్టిలో పడిపోతే లేపేవాడిని
మనసులోంచి పడిపోయావు ఎలా లేపను ?
మనసు నీకోసం
స్పందించడమే మానేసింది
నీ సామీప్యాన్ని
ఇంకెలా కోరను ?
నీకెక్కువ ప్రాధాన్యత
ఇస్తున్నప్పుడు అనుకోలేదు
అదే బలహీనతై
పరిహసించబోతుందని !!
పరాయి వాళ్లు దాడి చేస్తారని
సిద్ధంగా ఉండేవాడిని
అర్థమయింది గాయమిచ్చే
అవకాశం ఆప్తులకే ఎక్కువని !!
ఎండలో తపించడానికి
ఇష్టపడుతాను కానీ
ఇక మనసొప్పదు
నీ నీడను ఆశ్రయించడానికి !!
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email

No Comments