మనసుకు నచ్చిన దానికి
స్వేదంతో రంగులు వేస్తాను
వర్ణం కోసం ఇతరుల
రుధిరాన్ని వాడను
నాకంటే అధికులతో
జతకట్టే ప్రయత్నం చేయను
దుప్పటి ఎంత ఉందో
కాళ్ళు అంతవరకే చాపుతాను
శత్రువుపై పగ
సాధించాలనుకుంటాను
ఆయుధాన్ని వాడను
అతని కంటే ఉన్నతంగా ఎదుగుతాను
శత్రువుపై నా గురి
ఎప్పుడూ ఉంటుంది
నేను చూసే గురికై
ఇతరుల భుజాన్ని వాడను
విమర్శ( కు ) లను చూసి
ఉద్రేకపడను
నేర్చుకోవడానికి
దోహద పడుతుందనుకుంటాను
మనసులో ఏముందో
నాలుకపై అదే వస్తుంది
నా వ్యక్తిత్వం
రాజకీయ నాయకుడిది కాదు
రాసేటప్పుడు ఈ విషయం
గుర్తు పెట్టుకుంటాను
సూక్ష్మ దృష్టితో చదివే
తెలివైన పాఠకులున్నారు
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
3 Comments
మీరన్నది నిజమండి.....పాఠకులు మహా మేధావులు.
Reply Deleteమనోభావాల్లోని మంచీచెడుని వేరుపరచడంలో మహాదిట్టలు.
పద్మార్పిత గారు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను . పాఠకుల విమర్షాప్రశంసలే మరో కవిత ( అందంగా ) వ్రాయడానికి ప్రేరణలు .కదండీ ..
Reply Deletewell said Mehdi garu
Reply Delete