Followers

Sunday, November 5, 2017

thumbnail

** నిశబ్ధం ధ్వనిస్తే .. **






నీ కళ్ళలో కోరిక చూసినప్పుడల్లా
నీ కోసం నా వలువలు
శిశిర కాలపు పత్రాలవుతాయి 
నా దేహం వెన్నెల పర్చుకున్న
మైదానమవుతుంది ...
నాలోని అందాలు
ఉత్తేజాన్ని ఇస్తాయో , లేవో
చెప్పలేను కానీ .
శోధించి , సాధించి , ఆస్వాదిద్దమనే
కోరికను మాత్రం నీకు ఇవ్వవు కదా ...
నీది కోరికో , నేఁ కొరకుండా
చూసుకోవాలనే తపనో ..
అర్థం చేసుకొనేలోపే ..
అద్భుతం అనిపించుకునే
ఆ క్రీడలో లీనమవుతాము ..
నెమ్మదిగా ప్రవహించే నదిలా ..
ప్రారంభమైన నీ వేగం నాలో
తన్మయత్వపు కెరటాలను సృష్టిస్తూ
మరింత వేగాన్ని ఆశిస్తూ ఉంటుంది ..
ఎదుటివారి గెలుపుకు సైతం
ప్రోత్సాహమిచ్చే ఆ వేగంలో
నాతో పరుగెత్తేవాడు గమ్యం వరకు
వెంటే రావాలని నాకు ఉండదా ...
నువ్వేమో కొద్ది దూరానికే
అలసి పడిపోతావు ..
నిన్ను వదిలి ముందుకు వెళ్లలేక ,
నీకోసమే ఆగలేక .. ఎంత సంఘర్షణ
అనుభవిస్తానో .. ఎలా చెప్పనూ...
ఉవ్వెత్తున లేచే నాలోని కెరటాలు
తీరానికి చేరకముందే
పడిపోవు .. నిక్షిప్తమైపోతాయి ..
నీ సమక్షంలో జలపాతంలా
తుళ్లుతూ ఉండే నేను ,
ఏం కావాలో చెప్పలేక
ఆ క్షణం మూగదాన్నావుతాను
నీ శారీరక బలహీనత అయి ఉంటే
నేఁ ఏదైనా భరించేదాన్ని
నీది మానసిక బలహీనత కదా ..
బయిట ఎన్నో అందాలను గ్రోలే నీకు
ఇంట్లోని దేహం ..
నిజానికి నా సమీపానికి వచ్చేటప్పటికి నీకు .
ఏ దాహం అవసరమవుతుందని ...
నీ బలహీనతను కూడ
నా చిరునవ్వుగా మార్చుకొని
రగిలే కోరికలను అనునయిస్తాను ...
కానీ ఎంత కాలం ఆ అనునయం
నా చేతుల్లో ఉంటుందని ... ?
నీ చేతల్లో మార్పు రాకుంటే
నీ చేతుల్లో జారకుండా ఉండగలనా .. !?


Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.