సంద్రాన్ని చూసినప్పుడల్లా
నువ్వు జ్ఞాపకం రాకమానవు
అది ఆహ్లాదంగా , ఆనందంగా
అనిపిస్తుందని కాదు ...
ఎగిసిపడే కెరటాల్లాగా
కనిపించే నీ ఆహ్లాదం వెనుక
సంద్రం అంతర్భాగం లో
దాగి ఉండే గంభీరత గుర్తుకొచ్చి....
నీతో మాట్లాడినప్పుడల్లా
సంద్రం గుర్తుకు రాకమానదు
అలల హోరులా నీ మాటలు
అస్పష్టంగా ఉంటాయని కాదు ...
తీరం సరిహద్దుగా ఆగిపోయే కెరటాల్లాగా ..
నీలోని ఆవేదనకు
నీ అధరాలు సరిహద్దై ఆపేస్తాయని ...
నువ్వు అప్పుడప్పుడు నవ్వుతూ చెబుతావు ..
ప్రతి వదనం వెనుక
కొంత వేదన ఉంటుంది
ఆహ్లాదంగా కనిపించేవారిలో
మరింత ఎక్కువ ఉంటుందని ...
ఉదాహరణ నువ్వే అని చెప్పాలనుకుంటాను
కానీ ఉక్రోషంగా నువ్వంటావు ....
నాలో వెతక్కూ నేను నటించలేను
నీకెలా చెప్పాలి ..నటించవు
నువ్వు అందులో జీవిస్తావని .....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
6 Comments
చాలా బాగుంది సార్
Reply DeleteThanks a lot sir
Reply Deleteబ్లాగ్ లో మరిన్ని పోస్ట్ లతో అలరించాలని ఆకాంక్ష..ప్రార్థన కూడా.
Reply DeleteThanks very much ...tappakunda Padma arpita garu...
Reply Deleteఅద్భుతం మీ అక్షరాలు.
Reply Deleteధన్యవాదాలు అండి గౌతమి గారు
Reply Delete