నిజానికి నువ్వేమి కావు
కానీ .. అలా అనుకోడానికి
నా మనసు ఒప్పుకోదు
నిజానికి నువ్వెoతో దూరం
కానీ ... చూడకుండా ఉండటానికి
నా దృష్టి ఒప్పుకోదు …
నిజానికి నువ్వొక అందమైన జ్ఞాపకం
కానీ... గతమనుకోవడానికి
నా వర్తమానం ఒప్పుకోదు
ఇవన్నీ .. నీకు చెప్పలేక
ఒకరితో పంచుకోలేక
మనసుకు ఒప్పించుకోలేక
వాక్యాల్లో రాయలేక ...
హృదయపు అట్టడుగులో
నిక్షిప్తం చేసి
అది కనిపించకుండా ఏవేవో
వ్యాపకాల రాళ్ళెస్తాను
కానీ ... తొలిసంధ్య కిరణాల్లో
అప్పుడు వీచే చిరుగాలుల్లో
మంచుబిందువులతో స్నానించిన పుష్పాల్లో
అర్ధరాత్రి దాటాక కనిపించే వెన్నెల్లో
నిశభ్దపు వేళ వినిపించే శ్రావ్యమైన ధ్వనిలో ....
ఇలా బాహ్యంలో కనిపించే ప్రతి అందంలో
చివరికి విధాతను స్మరించాలని చేసే ఏకాగ్రతలో
నువ్వు కనిపిస్తూ ఉంటావు .. అలా కనిపించినప్పుడల్లా
నిక్షిప్తమై ఉన్నా ఎన్నో భావాల్లో కదలిక ....
వాటిని స్థిమితం చేసే ప్రయత్నంలో
ఎన్నో చర్యలు చేసి ..చేసి చివరకు
బాధగా కళ్ళు మూసుకుంటాను
అప్పటి వరకు కనురెప్పల ముడతల్లో ఉన్న
నీ రూపం ఇంకా స్పష్టంగా ఎదురుగా సాక్షాత్కరిస్తుంది
అలాగే ఉండిపోతాను
నా పరిస్థితికి ఇంకేం చేయలేక ....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
10 Comments
bhayya...too good
Reply DeleteThank you bhai...
Reply Deleteआपके यादों में आपके ख्यालों में आपकी बाते सुनने आया था मेहदी अली साहेब, कुछ गड़बड़ में कमेंट दूं मुझे समझ में नहीं आ रहा, इतने दिनों बाद आपके ब्लॉग पे आया था
Reply Deleteమీ జ్ఞాపకాలను మీ ఊసులను ఆస్వాదించాలని ఇటుగా వచ్చి కామెంట్ ఏమి రాయాలో అని తికమక మకతిక లో రేయి లో సూర్యుడిని చూసి పగలంతా తారలతో పోటి పడి ఏదో రాయబోయి ఏదో రాసినట్టున్నాను మహది గారు. చాన్నాళ్ళు అయ్యింది మిమ్మల్ని పలకరించి, ఎలా ఉన్నారు ?
Meeku Comment Type Chesi Tondarapaatulo marichipoyi Maa Best Friend ki Send Chesesaanu Mehdi Gaaru...
Shukria dost...der se aaye koi baat nahin..par bhoole nahin is baat ka shukria...haqeeqat ye hai k mujhe bhi fursat nahin . main kuch likh bhi na raha hun aur na kisi dost ke blog par jaraha hun..ap ke blog par bhi aaya nahin maf kardena..jab bhi fursat mili tab avungaa.. ( ab bhi train me safar kar raha hun.. )
Reply Deleteaap bade hain.. aapke kaam ki vajah se aap aa na paaye.. ismein koi shikaayat nahi ali saaheb...
Reply Deletepalakarimpulalo manasu telika padite ade padivelu...
బాహ్యంలో కనిపించే ప్రతి అందంలో
Reply Deleteచివరికి విధాతను స్మరించాలని చేసే ఏకాగ్రతలో
నువ్వు కనిపిస్తూ ఉంటావు....అందమైన భావావిష్కరణ!
Bhayya..i want to post this on my blog....will specifically mention that its from you in the post...plz...
Reply DeleteThank you andi Padma arpita garu...
Reply Deletesure yaar...
Reply DeleteMEE SHRUDAYATAKU THANKS
Reply Delete