- ఎందుకమ్మా ఇలా చేసావు .. వినడానికి నువ్వు ఉండి ఉంటే నేఁ అడిగే దాన్ని కానేమో ... నేను అనుభవిస్తున్న జీవితాన్ని చూసి నువ్వే ఒప్పుకొనేదానివి నీ సుఖం కోసమో , నీకు నచ్చిన వాళ్లందరికి శరీరాన్ని ఇచ్చి చేసిన త్యాగం కోసమో డబ్బుకో , మరిదేనికో ఎవరి బీజమో కూడ అర్థం చేసుకోలేక నీ గర్భంలో నన్ను మోసావు నా పుట్టుకకు కారణమేవరో తెలుసుకోలేని నువ్వు నీకు అంటించిన భయంకరమైన వ్యాధికు కారణమేవరో ఎలా తెలుసు కుంటావులే ...నీకు తెలిసో ,తెలియకో ఎంతో మందికి దాన్ని బహుమానంగా ఇచ్చి ఉంటావు ...నువ్వు చేసింది పాపమో . త్యాగమో నాకు తెలియదు ..కానీ దాని ఫలితాన్ని నేను అనుభవిస్తున్నాను తల్లి ఎవరో చూపించలేను తండ్రి ఎవరో చెప్పలేనుఎంతమంది చిన్నారులు నాలా మృత్యువును అతి సమీపంగా చూస్తూ ఈ ఆశ్రమంలో దీనంగా ఉంటారో ఎవరికి తెలుసుఈ దైన్యాన్ని మర్చిపోతానో లేదో తెలియదు కానీ విచిత్ర జంతువులను చూసేలా జనాలు చూస్తారే దాన్ని మర్చిపోలేక పోతున్నానుమరణిస్తానని నాకు తెలుసు వాళ్ళకు తెలుసు నాకు తెల్సిన ఒక విషయం వాళ్ళకు తెల్సో తెలియదో నాకు తెలియదుమాకీ సమయంలో కావాల్సింది సానుభూతి ..స్వాంతన కాదు AIDS బాధితులు అంటరాని వాళ్లు కాదనే చేయూత ఆఖరి శ్వాస వరకు అందరిలో ఒకరమే అనే మానసిక స్థైర్యం ...AIDS DAY Sandarbhangaa raasina oka kavita
- చేయూత ఇస్తారు కదూ … !! | విహంగshar.esvihanga.com -
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments