నేస్తమా .. కాసేపలా నడుద్దామా ..!?
నడకతో అలుపు వస్తుందంటావా .. రాదులే ఒకసారి నాతో రా ...
కాసేపు నడిచావు కదా చూడు ..
ఇప్పటి వరకు నీలో ఉన్న అలసట ఎలా మాయమయిందో
అదే కాదు గమనించు నీలో ఎంత ఆహ్లాదం వచ్చేసిందో ..
నీ మానసిక బాధలన్నీ స్వేదంగా బయిటికెలా వెళ్లిపోయాయో ...
వేడెక్కే శరీరం కూడా ఎంత వెచ్చగా అనిపిస్తుందో ....
ఇదంతా స్పృశిస్తున్న చలి గాలుల మహిమా అనుకుంటున్నావా
కాదురా .. ఇష్టపడే వారితో పడే కష్టం కూడా ఇష్టాన్నే కలిగిస్తుంది ...
ఇలా ఎంత దూరం వరకు నడుద్దామంటే ఇప్పుడే ఏం చెప్పలేను
నిజానికి సమాధానం నా దగ్గర కూడ లేదు
నీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు
అలా వద్దనుకుంటే .. నువ్వు అలసిపోయే వరకైనా ,
లేదా నీకు ఆసక్తి కలిగించే మరో తోడు దొరికేవరకైనా
ఇలాగే కలిసే నడుద్దాము .. ఏమంటావు ?
అదికూడా నీకిష్టమైతేనే సుమా ! ..
నేనేలా భావిస్తానో అనుకోకు .
ఒంటరిగా నడిచే అలవాటు నాకు చాన్నాళ్లుగా ఉందిలే ...
నిజానికి ఒంటరిగా నడవటం నాకు చాలా ఇష్టం ..
రహదారిలో ఎందరి పైనో దృష్టి వెళ్తూ ఉంటుంది .. ఎవరెవరో పలుకరిస్తూ ఉంటారు .. యాంత్రికంగా స్పందిస్తుంటానే తప్పా .. మనసు దేనికి స్పందించదు ..
కేవలం నీ ఆలోచనలే చుట్టూ ఆవరించుకొని ఉంటాయి ..
నీ ఆలోచనలకు ఎలాంటి అంతరాయం ఉండదు ...
నా స్కోత్కర్ష వదిలేయి నీ అంతరంగం విప్పు .. నీకేది ఇష్టమో మనస్ఫూర్తిగా చెప్పు ..
మందహిస్తున్నావంటే కొంత దూరం నాతో నడుస్తావనే కదా ... .
నాదొక చిన్న విన్నపం రా ..
నీ నుండి అనువంతైనా ఏది ఆశించను
ఆ సంకోచాన్ని , సంశయాన్ని వదిలేయి
నీతో నడవడానికి నేను అన్నీ వదిలి వస్తాను
నువ్వూ కూడ అన్నీ వదిలి రా .. అనను
నీకేవి ఆసక్తిని కలిగిస్తాయో అవన్నీ ఉండనీ ...
రహదారిలో ఎందరో తారసపడుతుంటారు
నాతో నడుస్తున్నప్పుడు పరులను చూడు
కానీ నాతో ఉన్నంతసేపు పరధ్యానంగా ఉండకు
చెవులతో ఎన్నో శబ్ధాలు వినూ
నాతో ఉన్నప్పుడు నా మాట మనసుతో వినూ
నాపై ఆసక్తి తగ్గినపుడు ఎలాగో వెళ్తావు ..
వెళ్ళు ఆపను ..ఆపలేను
కానీ నిరీక్షించడానికి ఏదో చూపించు ఒక అందమైన మలుపు
నువ్వూ తిరిగి వస్తావనే నమ్మకం లేకపోయిన
నేను నీ పరిసరాల్లోనే ఉండాలనే ఆసక్తిని
నాలో సజీవంగా నిలుపు ...
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
10 Comments
మీరు పంపించిన తెలుగు సాఫ్ట్ వేర్ కు థాంక్స్ ... చాల బాగా రాసారు . మీరే వృత్తి చేస్తారో తెలియదు కానీ అది కూడ మీలా సున్నితమై ఉంటుంది . మరింత బాగ వ్రాయండి . .. అప్పుడప్పుడు నా బ్లాగ్ కు రండి ..
Reply Deleteఆ సాఫ్ట్వేర్ ఆన్ లైన్ కాదు .. నెట్ లేకపోయిన వర్క్ చేస్తుంది .. థాంక్స్ దేనికండి .. నిజానికి నేను ఒకే సారి మీ బ్లాగ్ కు వచ్చాను . మళ్ళీ చూస్తాను మీరు ఏదైనా పోస్ట్ చేసినపుడు .. నాది ప్రైవేట్ జాబ్ అండి . సున్నితంగానే ఉంటుంది .. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన తెగి పోతుంది ..మీలా గజిటెడ్ పోస్ట్ కాదు . మీ అభిమానానికి థాంక్స్ .. ఒక రిక్వెస్ట్ .. మంచి కవితలు ఆస్వాదించాలంటే పద్మార్పిత గారి బ్లాగ్ ఫాలో అవండి . మంచి కవయిత్రి .. మంచి వ్యక్తిత్వం ఉన్న స్త్ర్రీ .. తను మీ ఫ్రెండ్ కూడ .. కదా ..
Reply Deleteకాసేపలా నడుద్దాం పదమని మొత్తం హృదయాలాపన్ని ఆస్వాధించేలా చేసారు మహదీగారు. good one
Reply Deleteకాసేపైన వెంట నడిచినందుకు చాల థాంక్స్ .. బాహ్యంలో తీరని కొన్ని కోరికలు భావాల్లో తీరుతాయేమో ... మీ అభిమానానికి మరోసారి థాంక్స్ పద్మ అర్పితగారు
Reply Deleteభావాలు, ఆలోచనలు అన్నీ కూడా స్నేహితులతోనే కదా పంచుకోగలం.మన భావాలను మనసుతో ఆస్వాదించేవారే కదా నిజమైన స్నేహితులు. మన మాటలు వింటున్న స్నేహితుడు పరధ్యానంగా ఉంటే కోపం వస్తుంది. ఎందుకో తెలియదు. మీ కవిత ఏవేవో స్నేహాలను గుర్తుకుతెచ్చింది. ధన్యవాదాలు.
Reply Deleteనవజీవన్ గారు ... భావాలను మనసుతో ఆస్వాదించేవారే కదా నిజమైన స్నేహితులు. మీరన్నది అక్షరాల నిజం . కానీ ప్రతివారికి కొందరు స్నేహితుల వలన ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది . ఒక విషయం మాత్రం వాస్తవం .. ఈరోజు పరధ్యానంగా ఉండే వారు .. రేపు ఎవరో ఒకరి ధ్యానానికి తపించి పోతారు . మీ రాకకు , స్నేహపూరితంగా వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.
Reply Deleteఅభియోగమా లేక ఆవేదనో అర్థంకాలేదండి..
Reply Deleteఅభద్రతా భావం ఉంటే అభియోగం .. ప్రేమ ఉంటే ఆవేదన...
Reply Deleteమన మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది . మీరు ఎలా అనుకుంటే అలా ...
రహదారిలో ఎందరో తారసపడుతుంటారు
Reply Deleteనాతో నడుస్తున్నప్పుడు పరులను చూడు
కానీ నాతో ఉన్నంతసేపు పరధ్యానంగా ఉండకు
చెవులతో ఎన్నో శబ్ధాలు వినూ
నాతో ఉన్నప్పుడు నా మాట మనసుతో వినూ
నాపై ఆసక్తి తగ్గినపుడు ఎలాగో వెళ్తావు ..
వెళ్ళు ఆపను ..ఆపలేను
కానీ నిరీక్షించడానికి ఏదో చూపించు ఒక అందమైన మలుపు
నువ్వూ తిరిగి వస్తావనే నమ్మకం లేకపోయిన
నేను నీ పరిసరాల్లోనే ఉండాలనే ఆసక్తిని
నాలో సజీవంగా నిలుపు .....
hii sir nijam ga bale rasaru andhi....
manasuki hathukunela.
nenu daily mi blog visit chesthanu andhi...
mee abhimaanaaniki ..mee agamanaaniki hrudaya poorvaka dhanyavaadaalu Navya sri garu
Reply Delete