Followers

Friday, August 2, 2013

thumbnail

!! నీ విజ్ఞ్యత అది ……! !!





నేనొక సాగరాన్ని ... గంభీరంగా కనిపించడం నా నైజం 
భయపెడ్తున్నానా , కెరటాలతో ఆడుమంటున్నానా 
ఆర్థమెలా చేసుకుంటావో నీ విజ్ఞ్యత అది

నేనొక సమీరాన్ని ... స్పృశించడం నా నైజం
చలిగాలిస్తున్నానా , చిరాకు కలిగిస్తున్నానా
ఆర్థమెలా చేసుకుంటావో నీ విజ్ఞ్యత అది

నేను శశిని .. వెన్నెల కురిపించడం నా నైజం
విరహాన్ని రగిలిస్తున్నానా , ఆహ్లాదాన్ని కలిగిస్తున్నానా
ఆర్థమెలా చేసుకుంటావో నీ విజ్ఞ్యత అది

నేనొక అందమైన రాగాన్ని .. ఆహ్లాదాన్ని ఇవ్వడం నా నైజం
వినోదాన్ని ఇస్తున్నానా , విషాదాన్ని రప్పిస్తున్నానా
ఆర్థమెలా చేసుకుంటావో నీ విజ్ఞ్యత అది

నేనొక గ్రంధాన్ని .... విజ్ఞానాన్ని ఇవ్వడం నా నైజం
ముఖచిత్రాన్ని చూసే అంచన వేయాలా ,.. చదివి అంచనాకు రావాలా
ఆర్థమెలా చేసుకుంటావో నీ విజ్ఞ్యత అది

నేనొక అనుభవాన్ని ....పాఠం నేర్పడం నా నైజం
అప్రమత్తత నేర్చుకోవాలా , నిర్లక్ష్యంగా ఉండాలా ,
ఆర్థమెలా చేసుకుంటావో నీ విజ్ఞ్యత అది

నేనొక కవితని .. జాగృతం చేయడం నా నైజం
కవితలో నిన్ను వెదుక్కుంటావా .. ఇతరుల గురించి అనుకుంటావా
ఆర్థమెలా చేసుకుంటావో నీ విజ్ఞ్యత అది









Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

4 Comments

avatar

మనిషి సదా విజ్ఞాణాన్వేషణలో సంచరిస్తూ కొట్టుమిట్టాడుతుంటే......విజ్ఞ్యతనేం చూపించగలడు చెప్పండి! Kabhi kabhi tho thoda hat ke socha karo yaar :-)

Reply Delete
avatar

కాస్తో కూస్తో విజ్ఞత ఉన్నవారే మరింత విజ్ఞాణాన్వేషణ కోసం సంచరిస్తారేమో ...
Hat ke sochne ki salahiyat mujh me agar hoti ..
Har kali mere liye phool ki tarah khilti

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.