Followers

Wednesday, January 18, 2017

thumbnail

** ఏమివ్వనూ ... **


నా పరిచయం ఏమివ్వనూ ... 

లిప్త కాలమైన నీ శ్వాస తంత్రులో చలనం ఆగినట్లు 
అనిపిస్తే .. అర్థం చేసుకో .. 
నీ హృదయాంతరాల్లో 
నిక్షిప్తమై ఉన్న ఓ గత కాలపు జ్ఞాపకాన్ని అని ...Saturday, January 14, 2017

thumbnail

ఏం చేసుకోనూ ...
క్షణాలు , నిమిషాలు , గంటలు 
ఆలోచించి ఆలోచించి 
ఎన్ని మాటలు మూటగడుతానో .. 
నీ సమక్షంలో ఏది గుర్తుకు రాదు ... 
నువ్వెళ్లిపోయాకా అవన్నీ ఏంచేసుకోనూ ...
thumbnail

** నీ కెలా చెప్పనూ ... **


సంద్రాన్ని చూసినప్పుడల్లా 
నువ్వు జ్ఞాపకం రాకమానవు 
అది ఆహ్లాదంగా , ఆనందంగా 

అనిపిస్తుందని కాదు ...

ఎగిసిపడే కెరటాల్లాగా 
కనిపించే నీ ఆహ్లాదం వెనుక 
సంద్రం అంతర్భాగం లో 
దాగి ఉండే గంభీరత గుర్తుకొచ్చి....

నీతో మాట్లాడినప్పుడల్లా 
సంద్రం గుర్తుకు రాకమానదు 
అలల హోరులా నీ మాటలు
అస్పష్టంగా ఉంటాయని కాదు ...

తీరం సరిహద్దుగా ఆగిపోయే కెరటాల్లాగా .. 
నీలోని ఆవేదనకు 
నీ అధరాలు సరిహద్దై ఆపేస్తాయని ...

నువ్వు అప్పుడప్పుడు నవ్వుతూ చెబుతావు .. 
ప్రతి వదనం వెనుక 
కొంత వేదన ఉంటుంది 
ఆహ్లాదంగా కనిపించేవారిలో 
మరింత ఎక్కువ ఉంటుందని ...

ఉదాహరణ నువ్వే అని చెప్పాలనుకుంటాను 
కానీ ఉక్రోషంగా నువ్వంటావు .... 
నాలో వెతక్కూ నేను నటించలేను 
నీకెలా చెప్పాలి ..నటించవు 
నువ్వు అందులో జీవిస్తావని .....
Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.