శైశవం లో నేనేడిస్తే అమ్మకు నిద్ర భంగమని
మా నిద్ర కోసం నీ నిద్రను పంచావు
మేము స్వేదంలో తడిస్తే
నువ్వు వాయువయ్యావు
మా చీకటిని దూరం చేయడానికి
నువ్వు వెలుతురయ్యావు
మా వదనాల్లో సంతృప్తిని వెదికావేగాని
నీ అలుపును ఎప్పుడు చూపించలేదు
మా కడుపులు నింపడానికే చూసావేగాని
నీ ఆకలిని ఎప్పుడు చూపించలేదు
బాల్యంలో తప్పటడుగులకు ఆసర అయ్యావు
యవ్వనంలో తప్పటడుగులు పడకుండా మార్గదర్శి అయ్యావు
పరువుకు హద్దు చూపిస్తూనే పూర్తి స్వేచ్చను ఇచ్చావు
విజయాలకు మెట్లువయ్యావు పడినట్లనిపిస్తే ఆసరావయ్యావు
నువ్వు నాటిన మొక్క వృక్షమయ్యేవరకు ఆలంబన అయ్యావు
ఇక ఈ వృక్షాన్ని ఏ తూఫాను కదిలించలేదు అనుకున్నావో
నా నీడలో విశ్రమించకుండా ... వెళ్లిపోయావు నాన్న ...
నా సంతానం కోసం నీలా కష్టపడలేను
ఆ బాధ్యత నువ్వు నేర్పలేదని కాదు ..
ఆ అవసరం రాకుండా సర్వం ఇచ్చివెళ్లావు ....
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోనూ ....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
6 Comments
ఏమిచ్చినా ఆ రుణం తీరదు,
Reply Deleteవారికి సేవచేసుకోవటమూ,
వారు లేకుంటే వారి ఆత్మకై దువా అడగటమూ తప్ప.
తమ్ముడూ మీ కర్తవ్యం అక్షరాలలో అర్పించారు, అభినందనలు
Thanks Deedi... aapyayatato kudina mee comment ku...
Reply Deleteనాన్న ప్రేమకు కవితామాలికలతో పట్టాభిషేకం చేసిన మీ కలానికి మనస్ఫూర్తిగా అభినందనలు..
Reply Delete" మా వదనాల్లో సంతృప్తిని వెదికావేగాని
Reply Deleteనీ అలుపును ఎప్పుడు చూపించలేదు
మా కడుపులు నింపడానికే చూసావేగాని
నీ ఆకలిని ఎప్పుడు చూపించలేదు "
ఎంత మంచి భావనలివి..
ఎలా వస్తాయో భావనలు ఈ రీతిలో..
చక్కటి పదజాలం ,, మంచి అల్లిక,
సాగి పోయే శైలి ..
ఆహ్లాదకరంగా ఉంది చదువుతూ ఉంటె
అభినందనలు అలీ భాయ్ సాబ్
*శ్రీపాద
నవజీవన్ garu dhanyavaadaalu
Reply DeleteSripada***శ్రీపాద sir hrudayapoorvaka thanks
Reply Delete