Followers

Saturday, June 29, 2013

thumbnail

నిష్క్రమించు ... కాని నెమ్మదిగా




మన మధ్య ఆగాధం ఏర్పడవచ్చు ..నిజమే
అందరూ గుర్తించేలా
నువ్వు  ప్రవర్తించడం భావ్యమా ?
వెళ్లిపోవడానికి దారికై
ఒక్కో ఇటుక తీసేస్తున్నావు
ప్రహరీ కూల్చి ఇతరులకు
దారి చూపడం న్యాయమా ?
వెళ్లిపోవాలనే నీ నిర్ణయాన్ని
తొందరపాటని నేననలేను
నాకు తెలుసు నువ్వొక
సరదాగా సాగిపోయే సమీరానివి
నిన్ను స్థిరంగా ఆపడం నాతరం కాదని ....
వెళ్లిపో .. వద్దనను ..కానీ
అర్ధాంతరంగా నానుండి నిష్క్రమించకూ ...
తొలి సంధ్యను నిశి వదిలినట్లు నెమ్మదిగా వదిలిపోలేవా ?  
నువ్వు మనస్ఫూర్తిగా నాతో ఉండకు
కలిసే ఉన్నామని నటించలేవా... ?.
నా పరిసరాల్లో రావడం నీకిష్టం లేదని నాకు తెలుసు
కనీసం నా పరిధిలో నీ ఉనికి ఉన్నట్టు ప్రవర్తించలేవా ..?


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

9 Comments

avatar

అంతా విషాదమేనా.....కూసింత నవ్వుతూ మరచిపోతే మర్డర్ చేస్తానని చెప్పొచ్చుకదండి :-)( just kidding chaala baagundi)

Reply Delete
avatar

ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు .. జీవన పయనం - అనికేత్ గారు

Reply Delete
avatar

అంతా విషాదమేనా.. na jane kyun ek bat yaad aagayi …zakhm bhi deti ho marham bhi lagati ho ..aaj tak samajh na saka aakhir tum kaisi ho… మర్డర్లను ఆపడం నా వృత్తి కదండీ .. ఆ మాట నేనెలా అనగలనండి ... మెచ్చినందుకు ధన్యవాదాలండి ... Padma ARPITA గారు

Reply Delete
avatar

mujhe bhi ek shayari yaad aayaa...
Gujarish hamari woh maan na sake
Majboori hamari woh jaan na sake
Kehtehi marneke baad yaad rakhenge
Jeeteaji jo hamea pehchaan na sake :-)



Reply Delete
avatar

Nice poetry ...thanks for response Arpita ji

Reply Delete
avatar

నాకు చాల నచ్చేసింది మీ కవిత దాని స్టైల్ :)

Reply Delete
avatar

Thanks very much TELUGAMMAAYI Garu

Reply Delete
avatar

మంచితనం నిండు కుండైతే
మరచి పోగలమా ఆప్యాయతానురాగం
భావం తటస్తమైతే
దాల్చగలదా మాట మౌనం
కంటి కెదురుగా నువ్వు కనిపిస్తే
ఆగ గలదా నిలకడ గా నా పాదం

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.