ఎలా గుర్తించుకుంటావు నన్ను
నీ కవితకు ప్రేరణ కాను
నీ పాటకు పల్లవిని కాను
ఉదాసీనంగా ఉన్నప్పుడు
అనిపించే ఆహ్లాదాన్ని కాను
ఆనందంలో ఉబికివచ్చే
అశ్రువుని కాను
నీ స్వప్నాల్లో కనిపించే
అస్పస్టమైన
రూపాన్ని కాను
నువ్వు ఏకాంతంలో రాల్చే భాష్పాన్ని కాను
కనీసం ఆ భాష్పాన్ని
తుడిచే చూపుడు వేలుని కాను ...
మర్చిపోవాలనుకున్న వెంటాడే
అందమైన స్మృతిని కాను
నీ భవిత
గురించి అందంగా
మలుచుకోవాలనుకున్న ఆకృతిని కాను
నీ అంతరంగా పంచుకుంటున్న
ఆప్త నేస్తాన్ని కాను
నీ గాయానికి ఉపశమనమిచ్చే
లేపనాన్ని కాను
ఒకరిని చూస్తే అసంకల్పితంగా
కలిగే స్పందనను కాను
నేత్రం విప్పారాకుండా
చూసే అద్భుతాన్ని కాను
నీకున్న నేస్తాల్లో నాకంటూ
ఏదో ప్రత్యేకత ఉన్నవాన్ని కాను
నువ్వు పూజకు అర్పించాలనుకొనే
పద్మాన్ని కాను ...
ఎలా గుర్తించుకుంటావు నన్ను...! ?
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
4 Comments
గుర్తుంచుకోవాలంటే గుండెలో ప్రేమ ఉంటే చాలేమో :-) చాలాబాగుందండి.
Reply Deleteఏ క్వాలిటీ లేకపోవడమే ఒక పెద్ద క్వాలిటీ అండి :-)
Reply Deleteఅది అర్థం చేసుకోలేకనే .. ఆత్మన్యూనత భావం పెరిగిందనుకుంటానండి ... నచ్చినందుకు ధన్యవాదాలండి
Reply Deleteనిస్పృహలో ఉన్న వాళ్ళకు ఉత్సాహాన్ని ఇస్తాయి మీ వాక్యాలు .. ఇక ఏ అర్హత గురించి శ్రమించరు ...
Reply Delete