తెలుసు కదా...!
ప్రకటిస్తేనే కనిపించేది అనురాగం కాదని
అది
అదృశ్యంగా ఉండి స్పృశించే అనుభూతని ....
పంచి ఇస్తేనే స్వీకరించగలిగేదే తప్ప
ప్రేమను అపహరించలేమని నాకు తెలుసు కదా
దూరం ఉండటం ఎడబాటని
దూరమే మరింత సామీప్యం పెంచుతుందని
మౌనంగా ఉంటే నిర్లక్ష్యం కాదని
సమీపంగా వస్తే దాన్ని అలుసుగా భావించొద్దని నాకు తెలుసు కదా
నా మందహాసం ఎవరి గురించైనా కానీ
నా కంటి
మెరుపులు ప్రసరించేది నీపైనేనని నీకు
తెలుసు కదా
నా దృష్టిలో
అందరూ ఉండవచ్చు
హృదయంలో
ప్రతిష్టబడి ఉంది నువ్వే అని నీకు తెలుసు కదా
నాలుక
ఎందరితోనో మాట్లాడుతున్న
నీతో
మాట్లాడేది మనసుతోనని నీకు తెలుసు కదా
నీకు
తప్ప మరెవ్వరికీ చోటు ఇచ్చేంత
విశాల
హృదయం నాకు లేదని నీకు తెలుసు కదా
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
Beautiful Pic
Reply DeleteThank you
Reply Delete