నేస్తమా
....
నా
పట్లా నీకేర్పడిన తేలిక భావం తో నేనేకీభవిస్తాను .. కాదనను ..
కానీ
నన్ను ఒకే కోణంలో చూసి ఆ భావాన్ని ఏర్పర్చుకున్నావు
నీతో
ఆహ్లాదంగా ఉన్న మరో కోణంలో కూడా చూడు ...
నాకు
అర్థం కాకుండానే నాలోని కొన్ని అంశాలు
నిన్ను
చిరాకును కలిగించాయి నిజమే
కానీ
నీకేదీ ఆహ్లాదాన్ని ఇస్తుందో ఏది చిరాకును
కలిగిస్తుందో
తెలుసుకోనెంత
స్నేహ ప్రాయం నాకు రాలేదు కదా ..
దానికి
తోడు నీ వ్యక్తిత్వం
మరి
అంతా పారదర్శకంగా ఉండదు నాకు అర్థం కావడానికి ....
నీకు
చేరువవడానికే ప్రయత్నిస్తాను కానీ
దూరమవడానికి
నేనెలా కోరుకుంటాను ?
నాతో
జరుగుతున్నా పొరపాట్లను అప్పటికప్పుడే చెబుతూ ఉంటే
మరో
పొరపాటు చేసే సాహసం చేసేవాడినా ?
తప్పులన్నీ
లెక్కబెడుతూ ఒక్కసారిగా
నన్ను
శిశుపాలుడిలా చేసి శిక్షించడం భావ్యమా ?
నన్ను
దూరంగా నెట్టేయ్ ..వద్దనను ..కానీ చిన్న , చిన్న తప్పులకా ?
ఉన్నతంగా
ఉండే నీ వ్యక్తిత్వానికి ఏమయింది ?
మనం
స్నేహంగా ఉందాం అని ఇక అభ్యర్థించలేను ..
భిక్షగా
ఇచ్చే స్నేహంలో సానుభూతి ఉంటుంది తప్ప సాంత్వన ఉండదు
ఆ
సానుభూతి నాకు వద్దు ..
నీకు
దూరమైపోయాను బాధ గా ఉన్న ,
కనీసం కొంతకాలమైన నీ మనసులో ఉన్నాను అనే భావం చాలు తృప్తి
పడటానికి …..
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
4 Comments
అద్భుతం! అంతే. సరిగ్గా ఇవే మాటల్ని నేనీమధ్య ఒకసారి చెప్పాను.
Reply Deleteఅలేఖ్య గారు ...మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు ... మీరు , నేను అనే కాదు మంచి స్నేహితులను దూరం చేసుకోకూడదు అనుకొనేవారు ఆ వాక్యాలను ఏదోసారి చెబుతూనే ఉంటారు
Reply DeleteToo good words
Reply DeleteThanks Padma Arpita garu
Reply Delete