Followers

Tuesday, June 25, 2013

thumbnail

|| నువ్వెందుకు చూస్తావులే ! ||




నీ రహదారిలో పూలను
పరిచేవారినే గుర్తించుకుంటావు
నీ దారిలోని ముళ్లను
తీసేవారిని నువ్వెందుకు చూస్తావులే !
నిన్ను ఆకాశానికి ఎత్తేసే
వారినే చూస్తుంటావు
నేలపై బోతే నీకు ఆసరా ఇవ్వడానికి
సిద్ధంగా ఉండేవారిని నువ్వెందుకు చూస్తావులే !
నువ్వు ఆహ్లాదంగా ఉన్నప్పుడు
దగ్గరికొచ్చే వాళ్ళనే అభిమానిస్తుంటావు
నువ్వు బాధ పడితే మూగగా
ప్రార్థించేవాళ్ళను నువ్వెందుకు చూస్తావులే !
నీతో ప్రతీదీ వాదించే వారినే
ఎక్కువగా  ఇష్టపడుతుంటావు
నీ అహం గాయపడకూడదని మౌనంగా
ఉండిపోయే వారిని నువ్వెందుకు చూస్తావులే !



Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.