ఏకాంతంలో నేను రోదిస్తే
ప్రేమ అనునయిస్తూ అంటుంది
పిచ్చివాడ .. నన్ను నమ్ముకున్న
చాలా జీవితాలే నాశనమయ్యాయి
అదృష్టవంతుడివి కేవలం నీ మనసే విరిగింది .....
నేను నిద్రకు ఉపక్రమిస్తే
ఏకాంతం బాధగా అంటుంది
నాతో జతగా ఉంటావు
నీ నిట్టూర్పులు శ్రావ్యంగా ఉండి
నన్ను ఆహ్లాదపరుస్తాయి
నన్ను వీడి నువ్వు నిద్రిస్తే
మళ్ళీ నేను ఏకాంతమే కదా ....
నిన్ను త్యజించాలనిపిస్తే
నువ్వు , .. నీ ఆలోచనలు
వద్దనుకుంటాను .. ఇక
నిద్ర రాదు స్వప్నాలుండవు
నక్షత్రాల వీక్షణ తప్ప ...
రాత్రి ఎలాగో గడుస్తుంది
మగతగా నిద్రిస్తే
ఇలాంటప్పుడే కదా నీ స్వప్నాల అవసరం ...
ఆశ చూపిస్తున్నా నువ్ స్వప్నాల్లో వస్తావని
నా కనులు ఇప్పుడైనా మూత పడ్తాయేమో ....
బాహ్యంలో ఎలాగో కనిపించవు కనీసం స్వప్నాల్లో రావా ..
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
మీరు నిదురించకుండానే స్వప్నాల్లోకి రమ్మంటే ఎలాగండి......పగటి కలలు అని అనకండి :-) ఆరోగ్యానికి హానికరం.:-)
Reply Deleteగడిచిన రాత్రి అనుభవం పగలు రాయించి ఉంటుంది లెండి ... ( మనసు స్పృహలో లేనప్పుడు రాత్రేమిటి ..పగలేమిటీ అని ఉద్దేశమేమో... ) అభిమానాపూర్వకమైన మీ సలహా /సూచనకు ధన్యవాదాలండి
Reply Delete