ఎందుకు వస్తానిక్కడికి
నువ్వస్తావనే ఆశ తోనే కదా ...
నాతో మాట్లాడకపోయిన
నువ్విక్కడే ఉన్నావనే
అనుభూతి తోనే కదా ...
నీ నిశ్వాసనిక్కడ నేను
శ్వాసించగలననే కోరికతోనే కదా ...
నాకంటూ ఓ అందమైన ప్రపంచం ఉన్నా
నీ దృష్టి దానిపై పడాలనే
తపన తోనే కదా ....
నువ్వు నన్నే చూడాలనే అత్యాశ కాదు
నలుగురితో పాటు నన్నూ
చూడాలనే అభిలాష తోనే కదా ...
నీ ప్రశాంతతను భంగపర్చాలని కాదు
నా ఉనికి నీకు తెలపాలనే ఆరాటం తోనే
కదా .....
నీ మనసులో అణువంతైనా స్థానం
దక్కించుకోవాలనే అత్యాశ తోనే కదా ...
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
ఇలా ప్రశ్నిస్తే జవాబు చెప్పలేక.....అణువంతేంటి అఖిలాండం మీసొంతం :-) అంటుందేమోనండి
Reply Deleteఅంత సులభం కాదు లెండి ...దుర్బేధ్యమైన మనసు తనది ..దాన్ని ఛేదించగల శక్తి ఏవో కొన్ని వాక్యాలకు ఉండదు లెండి ..... స్నేహపూర్వకమైన మీ వ్యాఖ్యకు థాంక్స్ మామ్ ..
Reply Delete