Followers

Thursday, April 23, 2020

thumbnail

తను వెళ్లిపోయింది ...





తను వెళ్లిపోయింది ...
వెళ్ళిపోయిన విషయం
చాలా రోజుల వరకు తెలియనే లేదు
ఈ వాక్యాన్ని ఇలా రాయాలా .. లేక ఇంకోలా రాయాలా ..

అర్థం కాలేదు .. వెళ్లిపోయింది అంటే వదిలి పోయిందనా ?
లేక , చాలా రోజుల వరకు తెలియలేదు ..అంటే తనపై ఆసక్తి ఉంటే కదా .. అనా ..
నిజానికి తను జ్ఞాపకం ఉంచుకొనెంత పరిచితురాలు కాదు
ఆలాని నిర్లక్ష్యం చూపెంత అపరిచితురాలు కాదు

ఒక చిన్న పరిచయం .. చాలామంది లాగే ..
తనకున్న ఎందరిలో నేను .. నాకున్న కొందరిలో తను ..
ఎవరు ఎవరి నుండి ఏదో కోరుకొనే
ఏదో ఆశించే దశ కాదు .. ఇద్దరూ వెళ్లాల్సిన  దిశ కూడా ఒకటే కాదు

నిజానికి ఏదో ఆకర్షణకు లోనయ్యే వయసులు కాదు
ఏదో స్వాంతన పొందుదామనుకొనే భగ్న మనసులు  కాదు
చాలా దూరం నడిచాక ఎక్కడో కాసేపు ఆగి సేద తీరడం కోసం  తప్పా
తను నా గురించి .. నేను తన గురించి ఎక్కడ ఆగలేదు

ఏది జరగనప్పుడు .. వెళ్లిపోయిందనో ..
వెళ్ళిపోయిన చాలా రోజులకు తెలియలేదనో ..
చెప్పుకోవడం ..నిజమే అయితే
వెలితి అనేది లేదని చెప్పుకోవడం నిజం కాదేమో ..





Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

6 Comments

avatar

సలాం సాబ్...సూపర్గా రాస్తారు మీరు

Reply Delete
avatar

వా అలైకుమ్ అస్సాలామ్ ... షుక్రియ సాహబ్

Reply Delete
avatar

మీ బ్లాగ్ మళ్ళీ మీ అక్షరశ్వాసతో ఊపిరిపోసుకుంటుందో

Reply Delete
avatar

ప్రస్తుతమైతే మీరు ఇచ్చిన ఆక్సిజన్ పై ఉంది ...

Reply Delete
avatar

మన కోసం తపన తాపత్రయం వెల్లువగా ఉంటే
మన లోని మంచిని ఏదో ఒక నాడు గ్రహిస్తే
మన అనే దగ్గరితనం తాలుకు అవశేషాలు మిగిలి ఉంటే
తనకు తానుగానే దరీ చేరగలదు ఎవరి భాగ్యంలో ఏది రాసుంటే
అస్సలామ్ వాలేకుం భాయి జాన్.. ఖైరియత్ రహియేగా..

~శ్రీత ధరణీ

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.