పరుగెత్తగలుగుతున్నానని
నడక నేర్పిన నిన్ను ఎలా మర్చిపోగలనూ ... ?
గమ్యం కనిపిస్తుంది కదాని
అది చూపిన నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోగలనూ ..... ?
అలసి నడవలేకపోతున్నావని
నీకు ఆసరా ఇవ్వకుండా ఎలా వదిలి పోగలనూ .... ?
ఆనందంలో ఉప్పొంగుతున్నానని
ఉదాసీననంగా ఉన్నప్పుడు స్వాంతనిచ్చిన నిన్నెలా మర్చిపోగలనూ ... ?
నా చుట్టూ , నీ చుట్టూ ఎందరో ఉంటారు కదాని
నీపై ఉన్న అభిమానం చాటకుండా ఎలా ఉండగలను ...?
ఎలాగో నీ మనసులో స్థానం ఉంది కదాని
నిర్లక్ష్యం చేస్తే నా దృష్టిలో నేను ఉన్నతంగా ఎలా ఉండగలను ?
** పద్మార్పిత గారికి.. వారి చిత్రాన్ని వాడుకున్నందుకు కృతజ్ఞతలతో ...**
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
6 Comments
చాలా అద్భుతంగా రాసారండి
Reply Deleteఅందంగా చెప్పారు
Reply Deleteచాలా థాంక్స్ అండి ..
Reply Deleteచాలా థాంక్స్ అండి ...
Reply Deleteచాలా అద్భుతంగా రాసారండి.. అందంగా చెప్పారు
Reply Deleteaisa lagta hai k y tasveer kuch khas hai ..ap ke liye..
shukria .. tasveer nahi ..ise banane wale khas.... dost hai / thi ..
Reply Delete