ఎందుకనుకోవూ .....
!?
నీ అందమైన
భవిష్యత్తు అవుతానేమో ... నేనింకా నీ గతాన్ని కాలేదు
ఇప్పుడే ఎందుకు తెంపుతావూ ..... !?
నువ్వు
పుస్తకాల్లో దాచుకొనే పువ్వునవుతానేమో ...... నేనింకా పూర్తిగా పుష్పించనే లేదు
రాలేనని ఎందుకనుకుంటావూ ..... !?
నీకో అందమైన స్వప్నంగా వస్తానేమో ..... నువ్వింకా నిద్రించనే లేదు
పెదవెందుకు విరుస్తావూ ..... !?
నీ ఆకృతిని చూపే దర్పనాన్ని అవుతానేమో ... నీ అలంకరణ ఇంకా పూర్తి కానేలేదు
ఇప్పుడే ఎందుకు చదువుతావూ ..... !?.
నీకు ఆహ్లాదాన్నిచ్చే కవితానవుతానేమో ... నేనింకా భావాన్ని పూర్తిగా రాయనే లేదు
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
బ్యూటిఫుల్ కూర్పు.
Reply Deleteథాంక్స్ అండి ...
Reply Delete