నిశీధి వలవలు
ఒక్కొట్టిగా జారవేస్తుంటే
అస్పష్టంగా బహిర్గతమయ్యే తొలి సంధ్యలా ....
తొలి సంధ్యలో వినిపించే పక్షుల
కిలకిలా రవాల శ్రావ్యతలా ....
గోధూళి వేళ అమాయకంగా గంతులు వేస్తూ
తల్లిని అనుసరించే లేగ దూడలా .....
గ్రీష్మం తర్వాత కురిసి ఆహ్లాదాన్ని
ఇచ్చే మొదటి వర్షపు చినుకులా ....
వర్షం వెలిసాక నీటి బిందువుపై పడి
విశ్లేషం చెందే కిరణంలా ....
వర్షం కురుస్తున్నప్పుడు కూడ
అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే నులి ఎండలా .....
తొలి సంగమానికి సంసిద్ధమయ్యే
నవ వధువు మస్తిష్కంలా ...
అధరాల తొలి కలయికలో
వెన్నులోంచి వచ్చే జలధరింఫులా ...
ఫాల్గుణ మాసపు చలిలో చెలికాడి
వడి నిచ్చే నులివెచ్చని అనుభూతిలా ...
ప్రసవ వేదన మరిచి తొలి సంతానాన్ని
చూసే మాతృ హృదయంలా ....
తొలిసారిగా పాఠశాలకు వెళ్తూ వెనక్కి తిరిగి
తల్లిని చూసే పసివాడి బేలా చూపులా ....
గోరింటా పండిన చేతులను
చూసుకొని మురిసే పసిపాపలా ...
వసంతాల అనంతరం మాతృ భూమిపై అడుగిడినపుడు
అనిర్వచనీయంగా కలిగే ఆనందం లా ..
నువ్విలా ఉంటావు ....
అస్పష్టంగా బహిర్గతమయ్యే తొలి సంధ్యలా ....
తొలి సంధ్యలో వినిపించే పక్షుల
కిలకిలా రవాల శ్రావ్యతలా ....
గోధూళి వేళ అమాయకంగా గంతులు వేస్తూ
తల్లిని అనుసరించే లేగ దూడలా .....
గ్రీష్మం తర్వాత కురిసి ఆహ్లాదాన్ని
ఇచ్చే మొదటి వర్షపు చినుకులా ....
వర్షం వెలిసాక నీటి బిందువుపై పడి
విశ్లేషం చెందే కిరణంలా ....
వర్షం కురుస్తున్నప్పుడు కూడ
అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే నులి ఎండలా .....
తొలి సంగమానికి సంసిద్ధమయ్యే
నవ వధువు మస్తిష్కంలా ...
అధరాల తొలి కలయికలో
వెన్నులోంచి వచ్చే జలధరింఫులా ...
ఫాల్గుణ మాసపు చలిలో చెలికాడి
వడి నిచ్చే నులివెచ్చని అనుభూతిలా ...
ప్రసవ వేదన మరిచి తొలి సంతానాన్ని
చూసే మాతృ హృదయంలా ....
తొలిసారిగా పాఠశాలకు వెళ్తూ వెనక్కి తిరిగి
తల్లిని చూసే పసివాడి బేలా చూపులా ....
గోరింటా పండిన చేతులను
చూసుకొని మురిసే పసిపాపలా ...
వసంతాల అనంతరం మాతృ భూమిపై అడుగిడినపుడు
అనిర్వచనీయంగా కలిగే ఆనందం లా ..
నువ్విలా ఉంటావు ....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
మాటల్లో చెప్పలేని భావాలకి ఊహల్లో రూపాలు కల్పిస్తే ఇంతందంగా ఉంటాయన్నమాట!!!!!
Reply Deleteఊహల్లో ఉన్న ఆ అందమైన రూపం , వాస్తవమై ... తన గురించి వర్ణన ఎలా ఉందో చూసినపుడే ఆ అందానికి సార్థకత కదా ! ...
Reply Delete