Followers

Thursday, July 25, 2013

thumbnail

!! మరవకు ... !!




నువ్వింక పూర్తిగా పుష్పించనే లేదు 
తుమ్మెదల రోద అప్పుడే మొదలైయింది

వాటి ఝంకారం నీకిప్పుడు ఆహ్లాదంగా ఉండవచ్చు
క్రమంగా అదే అసహ్యాన్ని కలిగిస్తుంది

తుమ్మెదలు నీ కోసం వరుస కట్టాయని ఉప్పొంగిపోకూ
నిజానికి నువ్వు కాదు వాళ్ళకు కావాల్సింది నీలోని మకరందం

నీకంటే ముందు పుష్పించిన పుష్పాలకు తెలుసు
నీ రెమ్మలు విప్పారే వరకు ఎన్ని భ్రమణాలు చేస్తాయో ...

ఒక తుమ్మెద అంటుంది నువ్వు పుష్పించకుంటే
నా రెక్కలు త్యజించి నీ పాదాల్లో మరణిస్తాను

మరో తుమ్మెద అంటుంది నువ్వు కరుణించకుంటే
వంద భ్రమణాలు చేస్తూ నీ దగ్గరే ఉంటాను

ఇంకో తుమ్మెద అంటుంది రెమ్మలు విడదీయు
నీ అందం చూసి తరించిపోతాను ..నీ మకరందం గ్రోలను

మరొకటి మరోలా ..
ఇంకొకటి ఇంకోలా అంటూనే ఉంటాయి

పుష్పించడం నీ సహజ లక్షణం..
పుష్పించు నీ అందంతో ఆకర్షించు
కానీ ఎవరికి చనువు ఇవ్వకూ ....
అలుసు ఇవ్వకూ ... భ్రమాణాలు చేస్తూ అలసిపోని ..

పుష్పించడం నీ లక్షణమైతే
నీలోని మకరందాన్ని ఆశపడటం వాటి లక్షణం
మరో పుష్పాన్ని వెదుక్కుంటూ అవి పారిపోతాయి
నీ లోని మకరందం తగ్గినపుడు ...
.














Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

7 Comments

avatar

లేత ప్రాయాన్ని ఎంత అందంగా చెప్పారు జాగ్రత్తలు కూడా అంతే బాగా చెప్పారు ఆలీ గారు చాలా చాలా బావుంది

Reply Delete
avatar

Wah....Yeh nayi andaz ka ghazal kya hai Mehdi saab :-)

Reply Delete
avatar

మీ అభినందనకు ధన్యవాదాలు అండి ...

Reply Delete
avatar

such hai ghalti hogai..sudhar longaa..

Reply Delete
avatar

wow...very nice...manavta aur prakriti ka mishran ...kudarata aur insaniyat ka milap bakhoobi kiya janab...apka andaz qabile tareef hai janab...!

Reply Delete
avatar

aap k tareef karne ka andaz jo hai ..dil ko chu leta hai...shukria

Reply Delete
avatar

itni khoobsoorat kavita ki tareef bhi tho khoobsoorat honi chahiye janab..!

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.