నీకు తెలుసు నీకోసమే నేను
ఎదురుచూస్తుంటానని .....
అందుకే కదూ నీ ఉనికిని దాచుకుంటావు ...
ఎదురుపడితే పలుకరించి నీ
స్వేచ్చను
హరిస్తాననే భావం నీలో ఏర్పడి ఉండవచ్చు
నిజమే .. నిన్ను పలకరిస్తాను ...ఎందుకు ?
నాతో మాట్లాడాలనో ..
నా ఉనికి చాటుకోవాలనో కాదు
నాలో అహం పెరిగిందని అనుకోవద్దనే భయంతో ...
నువ్వనుకుంటావు ఏదో ఆశించి
నీ సమీపానికి వస్తున్నానని ....
నిజమే .. ఆశిస్తాను కొంత ఆహ్లాదాన్ని .. కొంత
స్వాంతాన్ని
నాలోని కొన్ని భావాలు నిన్ను ఇబ్బంది
పెట్టొచ్చు
నీ భావాల్లాగా , నాభావాలు
నా అంతరంగానికి ప్రతిరూపాలు కాదు
నా భావాలు నీ హృదయాన్ని
స్పృశించాలని భావిస్తానే తప్పా
నీ హృదయంలో నిక్షిప్తమై
నన్ను ఆకర్షించేలా చేయాలని కాదు ...
నువ్ నిర్లక్ష్యం చేసిన నీ చుట్టే
తిరుగుతున్నాను అంటే
నాలో ఆత్మాభిమానం లేక కాదు ..
దానికన్న ఎక్కువగా నీకు ప్రాముఖ్యత ఇస్తానని ....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
ఇది మరీ అన్యాయమండి.....తన చర్యల్ని కూడా మీరే ఊహిస్తే ఎట్లా? :-)
Reply Deleteనిజమే .. అన్యాయమేనండి ...నా చర్యలను తను ఊహించకపోవడం ...
Reply Delete