నేస్తమా
...
నిద్ర
రానప్పుడు ఎప్పుడైనా
అర్దరాత్రి దాటాక ఉండే నిశబ్ధాన్ని విన్నావా
..?
ఎన్నోసార్లు విని ఉంటావు ..
కానీ ఈసారి ఇలా విను
మసక చీకటిలో కూర్చొని
నీకు అత్యంత ప్రియమైన వ్యక్తిని ఊహల్లో తెచ్చుకో
ఇక చూడు ...
నీ దృష్టి ఎక్కడో కేంద్రీకృతమై ఉంటుంది
కానీ నీ మనసులో ఆ దృశ్యం ఉండదు
నీ ఎదురుగా ఆ వ్యక్తే కనిపిస్తుంటాడు
నీ ఆలోచనలన్నీ అతనే ఆక్రమించికుంటూ ఉంటాడు
నీకు తెలియకుండానే నీ ఆధారాలపై మందహాసం లాస్యం చేస్తుంటుంది
మీ మధ్య జరిగిన ఏదో ఒక సంభాషణ
నీ స్మృతిలో మెదులుతూ ఉంటుంది
ఏవో మాటలను జ్ఞాపకం చేసుకొని అనుకుంటావు
అలా కాకుండా నేనిలా మాట్లాడి ఉంటే బాగుండేది కదా ....
ఎందుకో కానీ మళ్ళీ జ్ఞాపకాలన్నీ కలిపి
అందులోంచి ఒక జ్ఞాపకాన్ని ఏరుకుంటావు
ఈ సారి అతని మాటలు జ్ఞాపకం వచ్చి పెదవి విరుస్తావు
అర్థం చేసుకొని కూడా అర్థం కానట్టు మాట్లాడుతాడు చా అతనేం మనిషి ..
ఎందుకో అతనే చెప్పిన ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది ..
జ్ఞాపకాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేవి కావు
..అందరిలో ఉన్నప్పుడు వచ్చి ఒంటరిలా చేసేవి ..
భారంగా నిట్టూర్చి అసంకల్పితంగా చుట్టూ చూస్తావు
ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది ..
ఇలాంటి సమయంలో తను నాతో ఉంటే ఎంత బాగుండేది
అంతట నిశబ్ధం ..మా ఇద్దరి శ్వాస తప్ప మరే ధ్వని ఉండకూడ ..
మళ్ళీ నిట్టూరుస్తావు ..
నేను పిచ్చిదానిలా అతన్ని జ్ఞాపకం చేస్తున్నాను తను హాయిగా నిద్రపోతుంటాడు
నాకెందుకు అతని జ్ఞాపకాలు...
ఉక్రోషంగా అనుకోని నిద్రించడానికి ప్రయత్నిస్తావు
నిద్ర రాదు ..ఇక మళ్ళీ అతని ఆలోచనలే.......
( నా డైరీలోని ఒక ఇష్టమైన పేజీ ... )
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
No words....just feel
Reply Deletethank you Padma arpita garu
Reply Delete