ఎన్ని దశాబ్దాలు గడిచాయో నేనక్కడ వచ్చి...
నా అడుగులు అప్రయత్నంగా నది వైపుకు వెళ్ళాయి
నది ఇంకా దూరంగానే ఉంది ...
దూరం నుండి వచ్చి ఇల్లు సమీపించగానే
తండ్రి చేయి వదిలించుకొని పరుగెత్తే పిల్లాడిలా
దృష్టి కంటే ముందు నా మనసు అక్కడికి చేరుకుంది
రాళ్ళు దొర్లుతుంటే వచ్చే ధ్వనిలా
ఏదో అస్పష్టమైన ధ్వని నా మస్తిష్కం గ్రహిస్తుంది
పెదాలు విప్పకుండానే నవ్వొకటి వచ్చింది
ఖననమైన కొన్ని జ్ఞాపాకాలు ఇంకా ఉన్నాయక్కడ ..
నన్ను చూసి అవి బయిటికి వచ్చే ప్రయత్నంలో
రాళ్ళు జరుపుతున్నట్టు అనిపించింది
బహుశ ఇందాక నా మస్తిష్కానికి కలిగిన అనుభూతి ఆదేనేమో ...
నది తీరానికి సమీపించాను అదురుతున్న మనసుతో ...
పెంపుడు జంతువులు యజమానిని చూడగానే పైకి లంఘించి
ఉక్కిరిభిక్కిరి చేసినట్టూ ... నా జ్ఞాపాకాలన్నీ
ఒక్కసారిగా నాపై పడి అనువణువును ముద్దాడసాగాయి ...
ఆటలాడుతూ దాక్కోనే నదిలోని గంగమ్మ గుడి
కళ్ళు మూసుకొని బోర్ల పడుకున్న తడి ఆరని ఇసుక ఒడి
ఇసుకతో కట్టుకున్న గూళ్ళు .. వాటిని ఉక్రోషంతో తోక్కెసే నా నేస్తం పాదాలు
నా పాదంపై కుప్పగా పోసి ఇసుక వొత్తుతూ గోపురం లా చేయాలని
ప్రయత్నించే నా నేస్తం లేలేత చేతులు ....
ఎన్నో జ్ఞాపకాలు ....
ఆర్ద్రమైన మనసు కళ్ళను తడి చేసింది
తడి ఎక్కువై .. బిందువులైయ్యాయి
అవి రాలి ఇసుకలో పడుతుంటే టక్కున నా దోసిళ్ళు అడ్డంగా వచ్చాయి
మనసు ఆలోచించిందేమో బహుశ
అవి ఇసుకలో పడితే ఎవరి పాదాలైన వాటిపై పడ్తాయని ...
మనసుకు తెలుసు కదా .. ఎవరు తొక్కిన ఫరవాలేదు అనుకోవడానికి
మనసుతో ఆడుకున్నప్రియురాలి కోసం రాలిన బాష్పాలు కావవి ....
అవి తిరిగిరాని బాల్యపు స్మృతుల్లో రాలినవి .. ఎంతో అమూల్యమైనవని ....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
dil ko chu gaye dost ..kahin mera bachpan ap dekheto nahin ..?
Reply Deleteakruti ji ..har ek ka bachpan haseen hota hai..is liye ke hum kisi ko dhoka nahi dete ..koi hame...
Reply Deletewo masoomiyat ab ham me kahan ?