నువ్వెన్ని రాళ్ళు విసురుతావో విసురు
నీ జ్ఞాపకాలను ఖననం చేసే
సమయంలో అవి పనికొస్తాయి
నువ్వు ఎవ్వరినైనా
నీవాడిగా చేసుకొంటావో చేసుకో
అప్పుడే కదా నా ప్రేమ ఎలాంటిదో నీకు తెలిసేది
నన్నెంతగా నిర్లక్ష్యం చేస్తావో చెయ్యి
అదే కదా నిన్ను
మర్వడానికి దోహద పడేది
నన్నెంత దూరం చేస్తావో చేసుకో
అలా అయితేనే కదా
నువ్వు చూద్దామన్న కనిపించనిది
నాపై కసితో ఎందరి దగ్గరికి వెళ్తావో వెళ్ళు
కానీ ఏదో వెలితి మాత్రం
నీకు తప్పక కనిపిస్తుంది
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
4 Comments
ఏదో అనేసి అన్నీ సాధించేస్తాను అనుకునే ఆకాంక్షకన్నా మీ మనసులో అంతర్లీనంగా ఆమెపై అభిమానం, ఆపేక్షే ఎక్కువగా కనపడుతుందండి మీ ఈ ఆవేదనా కవితలో
Reply Deleteపద్మ అర్పిత గారు .....
కేవలం ఉక్రోశాన్నే చూస్తుందే తప్ప అంతర్లీనంగా తనపై ఉన్న అభిమానం, ఆపేక్ష ... ప్రేమ అర్థం చేసుకోవడం లేదేమో ... మీలాంటి సహృదయం అందరికి ఉండదు కదండి ...
మీ అభిమాన పూర్వక వ్యాఖ్యకు ధన్యవాదాలండి ...
ఇంతకీ ఇది మీ ఆవేదనా లేక తన ఆలోచనో నా అతి చిన్ని మెదడుకి అర్థం కాలేదండి :-)
Reply Deleteసంకుచిత మనస్తత్వం ఉన్న ఓ భగ్న ప్రేమికుడి భావాల కోసం మీ మెదడు స్థాయిని దిగజార్చకండి . మీరు రాసే అందమైన కవితల్లాగే మీ మనసే కాదు మెదడు కూడ విశాలమైనది తెలుగమ్మాయి గారు ..
Reply Delete