Followers

Friday, August 9, 2013

thumbnail

!! చూడలేమా .... !!




ముత్యాలా కోసం 
సముద్ర గర్భంలోకి వెళ్లాలా ?
దోసిళ్ళు పడితే చాలదా .. 
నువ్వు నవ్వుతున్నప్పుడు ... 

హిమపు అందాన్ని చూడాలంటే 
సంధ్యావేళా గులాబీపై బిందువులనే చూడలా ?
నీ వదనాన్ని చూస్తే సరిపోదా .... 
దానిపై స్వేద బిందువులు పేరుకున్నప్పుడు .... 

కోకిల స్వరం కోసం 
వసంతం వరకు ఎదురుచూ
డాలా ?
తన్మయత్వం సరిపోదా ... 
నీ స్వరం వింటునప్పుడు .... 

వెన్నెల పరిపూర్ణతను చూడాలంటే 
పౌర్ణమికై ఎదురు చూడాలా ?
నీ మొఖాన్ని చూస్తే సరిపోదా .. 
నువ్వు కురులు విప్పి నా పైకి వచ్చినపుడు .... 

నిజమైన కళాత్మకతను చూడాలంటే 
ఎల్లోరా శిల్పాలనే చూ
డాలా ?
నీ శరీరాన్ని చూస్తే సరిపోదా .. 
సిగ్గుతో అందాన్ని మేలి ముసుగులో దాస్తున్నపుడు..... 



అంకితం ...
నా కవితలకు  ఆకృతి
దూరమైన , చేరువైనా
నా శ్వాసలో నిరంతరం ఉండే స్మృతి
నా నైట్ క్వీన్ కు ..... 


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

12 Comments

avatar

చాలా చక్కని భావాలున్న కవిత.

Reply Delete
avatar

very good feel. wonderful sir ji.

Reply Delete
avatar

ఇంత అల్పసోంతోషా మీరు మహదిగారు.....అయితే తప్పకుండా తను అత్యాశాపరురాలైన అదృష్టవంతురాలన్నమాట :-)

Reply Delete
avatar

కొన్ని సార్లు అభినందించడానికి పదాలు వెదుక్కోవాల్సి వస్తుంది .. నేను ఇది చూసాక ఆ స్థితిలో ఉన్నాను .. మీ నైట్ క్వీన్ ఎవరో కానీ మీలో ఇంత అందమైన భావాలు రగిలించి రాయడానికి ప్రేరేపించిందంటే తను పరోక్షంగా అభినందనీయురాలే ... నిజంగా చాలా రోజులకు ఒక అందమైన కవిత చదివానన్న తృప్తీ కలిగింది .. మీరు అనుమతి ఇస్తే నేను అనువదించుకొని నా బ్లాగ్ లో వేసుకుంటాను . .. మీ పేరుతోనే లెండి ...
సూచన : విషాదాన్ని రాయడం మానుకుంటే ఎంత అందంగా రాస్తున్నారో గమనించండి ..

Reply Delete
avatar

పద్మార్పిత గారు .. తను ఎప్పటికీ అదృష్టవంతురాలే .. నా ప్రార్థన కూడ అదే .. తను అలాగే ఉండాలని ..
hamara kya hai hum ayine me chand ko dekh kar apna samjh te hai ..

Reply Delete
avatar

మీ అభిమానానికి ధన్యవాదాలు ఆకృతి గారు .. మీ బ్లాగ్ లో మీ పేరుతోనే నిరభ్యంతరంగా వేసుకోవచ్చు .. నేను ప్రైవేసి ఎక్కువగా ఇష్టపడుతాను .. పబ్లిసిటిని కాదు .. నా నైట్ క్వీన్ అంటే మరోలా భావించకండి .. పెళ్ళైన వాడికి నైట్ క్వీన్ ఎవరుంటారండి .. భార్యే కదా ...

Reply Delete
avatar

శరీరాన్ని చూడ్డం అంటే కోరిక...అదే తనువు తాకినట్లుగా ఊహిస్తే చాలదా అంటే సుకుమారంగా ఉంటుందేమో అలీగారు. అందమైన కవితతో ఆకట్టుకున్నారు.

Reply Delete
avatar

నండూరి వారికి ఎంకి లా మీకు మీ "నైట్ క్వీన్" అన్నమాట.. బాగుంది సార్ మీ కవిత...

Reply Delete
avatar

andamaina bhavam meedi ... naakaa samayam tattaledu .. thanks Aniket garu

Reply Delete
avatar

Nava jeevan garu ..antati polika vaddulendi ..naa varaku naa Night queen ENOUGH

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.