ప్రతి సుగంధానికి పుష్పాలే
కారణమనుకొనేవాడిని
నీ శ్వాస పరిమళం ఆఘ్రాణించేదాకా ...
మకరందాన్ని మించిన మధురమే
లేదనుకొనేవాడిని
నీ ఆధారాల తీపిదనం చూసేదాకా
శరీరం కూడ ధ్వనిస్తుందంటే
పరిహసించేవాడిని
నీ తన్మయత్వంలో దాన్ని వినేదాకా
నా బహుబలంపై ఎంతో
గర్వపడేవాడిని
ఉద్విగ్నంగా నువ్వు పెనవేసుకొనేదాకా
స్వర్గాన్ని చేరడానికి పుణ్యాలు
అవసరమనుకొనేవాడిని
అబద్దమని తెలీదు నీ మనసు గెల్చుకోనేదాకా ...
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments