నువ్వింత ఏహ్యంగా చూస్తున్నావే
మరిచిపోయావా ?..
నా నుండే పుట్టావని ...
నాపైనే తప్పటడుగులు నేర్చుకున్నావని
....
నా పలక పైనే ఓనమాలు దిద్దావని ...
ఆ ఓనమాలతోనే ప్రగతి సాధించావని ...
ఆ ప్రగతిని నాపైనే ప్రయోగిస్తూ
నా ఉనికి దాచాలని విశ్వ ప్రయత్నాలు
చేస్తున్నావే ...
నేనంటే ఇప్పుడు నీకు చిరాకు కలుగుతుందా ?
నాపై నడవటానికి సంకోచిస్తున్నావు
నీ పిల్లల్ని ఆడుకోవద్దని ఆంక్షలు
పెడుతున్నావు
నేనెవరికైనా హాని చేసానా ?
నాలో నిరంతరం ఆడుకొనే కర్షకులు
ఎప్పుడైనా వ్యాధిగ్రస్తులయ్యారా ?
కార్మికుల పసిపిల్లలు నా ధూళినే మొఖానా
అద్దుకుంటారు
మీ పిల్లల్లాగా తరుచూ ఆస్పత్రి మొఖాలు
చూస్తారా ?
కృత్రిమ వాసన ఇష్టపడుతుంటావే గాని
తొలకరిలో నా సువాసన
ఆస్వాదించలేకపోతున్నావు ..
నేనెంత మేలు చేసినా ..నాకు కీడే
చేస్తున్నావు
నా స్థన్యాన్ని పీల్చి నాలోని రక్తాన్ని
తోడేస్తున్నావు
నేను మళ్ళీ పుంజుకొనే శక్తి రాకుండా
వర్షాలను దూరం చేస్తున్నావు ...
నాలో సహనం నశించి
మీ విసర్జనాలను , మీ మాలిన్యాలను , మీ క్రుళ్లు శరీరాలను
నాలో ఐక్యం చేసుకోకుండా ఉంటే క్షణమైనా
ఉండగలరా ?
నను తాకొద్దని ఎత్తైన అంతస్తుల్లో
ఉంటున్నారే
మర్చిపోవద్దు ఏనాటికైనా ఐక్యమయ్యేది
నాలోనేనని ....
నువ్వు వద్దన్నా మన అనుబంధం
ఏనాటికి అంతం కానిదని ...
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
10 Comments
మట్టిని ఏహ్యంగా చూస్తే మట్టికొట్టుకుపోతాడు.....అందుకే ఈరోజుల్లో మడ్ బాత్, మడ్ పాక్స్ అని మట్టితో అనేక ప్రయోజనాలు అంటున్నారు.....మీరేమో ఇలా :-(
Reply Deleteప్రయోజనాలు లేవన్నానా ?.. మట్టిని ఏహ్యంగా చూసేవారిని నేను చాలమందిని చూసాను.. చూస్తూ ఉన్నాను ... ఇది అలాంటి వారికోసమే ...
Reply Deleteమట్టి ... మనసు రెండిటి బంధం ఒకటే అండి...
Reply Deleteనాలో సహనం నశించి
మీ విసర్జనాలను , మీ మాలిన్యాలను , మీ క్రుళ్లు శరీరాలను
నాలో ఐక్యం చేసుకోకుండా ఉంటే క్షణమైనా ఉండగలరా ?
నను తాకొద్దని ఎత్తైన అంతస్తుల్లో ఉంటున్నారే
మర్చిపోవద్దు ఏనాటికైనా ఐక్యమయ్యేది నాలోనేనని ....
నువ్వు వద్దన్నా మన అనుబంధం ఏనాటికి అంతం కానిదని ...కాదని తోసి వేయలేనిది అమ్మ ప్రేమ నేలతల్లి ప్రేమ అందుకే మనం ఆడుకుంటున్నాము వాళ్ళతో.....చాలా బావుంది మనసుకు హత్తుకు పోయింది
మట్టిలో పుట్టి మట్టి లో కలవాల్సిన వారు .. మట్టిని ప్రేమించాలి అసహ్యించుకోకూడదని బాగా చెప్పారండి.
Reply Deleteమంజు గారు ... కవితలను ఆస్వాదించగలిగే మీ మనసుకు జోహార్లండి ..
Reply Deleteఅభినందనాపూర్వకమైన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు
Vanaja Tatineni గారు ... మీకు ధన్యవాదాలు
Reply Deletematti goppadanam gurinchi baga chepparu ali garu
Reply Deleteస్వర్ణ గారు ... అభినందనాపూర్వకమైన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు
Reply Deleteపుట్టినోడికి తన ఒడిలో జాగనిస్తది, గిట్టినోన్ని తన కడుపున దాస్తది ఈ నేలతల్లి. నిజంగా ఏనాటికీ అంతంకానిది ఈ మట్టిబంధం.ఆ నేలమ్మ ఇక తన సహనాన్ని కోల్పోయి మనల్ని ప్రశ్నించే తీరును అద్భుతంగా వర్ణించారు అలి భాయ్....
Reply DeleteReally gr8... u & ur poetry.
Rayarakula Karthika Raju bhai .. అభినందనాపూర్వకమైన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు
Reply Delete