Followers

Friday, August 9, 2013

thumbnail

|| నువ్వెందుకిలా ఉంటావు .. ? ||




ఒక్కోసారి ఎగిసిపడే జలపాతంలా ... 
ఒక్కోసారి పరవళ్ళు తోక్కే నదిలా 
ఒక్కోసారి గంభీర సాగరంలా 
ఒక్కోసారి ధారగా కురిసే వర్షంలా
ఒక్కోసారి ఆహ్లాదాన్ని కురిపించే వెన్నెల్లా
ఒక్కోసారి వెనక్కి తిరిగి చూడాలనుకొనే అందంలా
ఒక్కోసారి వీడ్కోలిచ్చే బాష్పంలా
ఒక్కోసారి గాయానికి స్వాంతన ఇచ్చే లేపనంలా
ఒక్కోసారి చిరాకు కల్గించే గ్రీష్మంలా
ఒక్కోసారి ఏమి కనిపించని శూన్యంలా
ఒక్కోసారి అర్థం కాలేని ప్రశ్నలా ....
ఒక్కోసారి పరిష్కరించలేని సమస్యలా
నువ్వెందుకిలా ఉంటావు ... ?
స్థిరంగా ఉండలేని నీలో 

ఇన్ని మార్పులు వస్తుంటే
ఇక నాలో మార్పు రాక ఉంటుందా ?
సున్నితమైన నా మనసు 

గాయపడక ఉంటుందా ?
ఆసక్తి , అనురాగం , అభిమానం , ప్రేమ ..
ఆ గాయం నుండి ఏదో రోజు స్రవించక ఉంటాయా ?
నాలోని అనురక్తి ఇక 

విరక్తిగా మారకుండా ఉంటుందా ..?



Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

4 Comments

avatar

Chaaala chaala baaguntai mee post lu...

Reply Delete
avatar

ఎప్పుడు ఒకేలా ఉంటే ఆసక్తి తగ్గిపోతుందని .... స్త్రీ మనసును ఏనాటికి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు మహిదీ సర్ ........ నిజంగా చాలా చాలా బాగుంది ..

Reply Delete
avatar

నిజమే .. స్త్రీ మనసును అర్థం చేసుకోలేక పోవచ్చు ..కానీ పురుషుడి మనసు కూడ చంచలమైనదే .. ఒక స్త్రీ మరీ విసిగిస్తే .. స్వాంతన కోసం మరో తోడు వెదుక్కుంటాడు .. మీరు మెచ్చినందుకు థాంక్స్ అండి ..

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.