Followers

Monday, August 19, 2013

thumbnail

విధ్వంసమే ....

    


ఒక రసాయినిక పదార్థం విస్ఫోటించినపుడు అత్యంతా వేగంగా అక్కడి గాలిని నెట్టేసి శూన్యంగా మారుస్తుంది . ఆ వేగానికి సర్వం కొట్టుకుపోతాయి . మళ్ళీ ఆ శూన్యాన్ని పూరించడానికి  గాలి అదే వేగంతో వెనక్కి వచ్చేస్తుంది .
      వస్తు .. వస్తూ అన్నిటిని నెట్టుకుంటూ వస్తుంది ..
       గాలి వెళ్ళినా , వెనక్కి వచ్చిన చేసేది మాత్రం విధ్వంసమే ....
       ఇలాగే .....
      నా హృదయం విస్ఫోటించినపుడు  అత్యంత వేగంగా నిన్ను తన నుండి నెట్టేసి శూన్యంగా మార్చింది  . ఆ వేగానికి నీ అనురాగం , అభిమానం , అవమానం అన్నిటిని కొట్టుకుపోయింది  . మళ్ళీ ఆ శూన్యాన్ని పూరించడానికి అదే వేగంతో అన్నిటిని నెట్టుకుంటూ నీ జ్ఞాపకాలను తీసుకొచ్చింది .  
      నువ్వు  వెళ్ళినా , నీ జ్ఞాపకాలను వెనక్కి తీసుకువచ్చిన జరిగేది మాత్రం మానసిక విధ్వంసమే ....
 




Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

4 Comments

avatar

ప్రేలుడు పదార్థాన్ని , హృదయాన్ని కలిపి పోల్చిన తీరు అభినందనీయం ... కానీ మహిది గారు అన్నీ హృదయాలు అలాగే ఉండవు . మీరు చూసిన వాటితో అన్నిటిని పోల్చకండి ..
బాగా రాసారు .. మరిన్ని రాయాలని ....

Reply Delete
avatar

ఆకృతి గారు ... మీ అభిమానపూర్వకమైన వ్యాఖ్యకు ధన్యవాదాలు

Reply Delete
avatar

మానసిక విస్ఫోటానికి రసాయనిక చర్యలెందుకు....మాటేచాలదా?:-)

Reply Delete
avatar

అద్భుతమైన వ్యాఖ్య ఇది ... సమాధానం ఇవ్వలేకపోతున్నాను

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.