Followers

Wednesday, August 28, 2013

thumbnail

!! ఎవరి తరం కాదు..... !!


ఒక చీకటి రాత్రిలో  నిద్ర నాతో అన్నది
నువ్వెప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటావు
సమాజాన్ని చైతన్యపరిచే కవి వా ...కాదే ..
లోకాన్ని ఉద్ధరించే శాస్త్రవేత్తవా ...కాదే
జనాల మానసిక రుగ్మతలను కోసం 
తపస్సు చేసే పుణ్యపురుషుడివా ..కాదే
మరెందుకు ఎప్పుడు ఆలోచనల్లోనే ఉంటావు ?
నీ పరిసరాల్లో ఎంతసేపటి నుండి తారట్లాడుతున్నాను
ఆవలింతల సందేశాన్ని పంపించాను
నీ కనురెప్పలపై ఆసనం వేసాను ...
ఎంతకు చలించవేం  ?
అభ్యర్తిస్తున్నావో , అదరగొడుతున్నావో తెలియదుగాని
శుష్కంగా నవ్వి భృకుటి ముడివేస్తావు
నీకు తెలియనిదని కాదు నావిలువ ...
ఎదోలోకంలో ఉంటున్నావు కదా  . అందుకే మరోసారి చెబుతాను
నాకోసం ఎంతమంది తపిస్తారు ..
నాకోసం ఎన్నెన్ని ప్రయాసలు పడ్తారు ?
నేను వాళ్ళను వరించాలని శయనానికి ,
శరీరానికి ఎన్నెన్ని అలంకరణలు చేస్తారు ?
నేనప్పుడు స్వయంవరం ప్రకటించకుంటే
మందుకో , మాత్రకో నన్ను లొంగదీసుకుంటారు
అయిన వాళ్ళకు నా పరిపూర్ణ సౌఖ్యాన్ని ఇవ్వను
నీకు తెలియదేమో నేను మనస్ఫూర్తిగా వరిస్తే
ఎన్ని రూపాల్లో సౌఖ్యాన్ని ఇస్తానో
తల్లిలా లాలిస్తాను
భార్యలా మురిపాలిస్తాను
ప్రేయసిలా అనురాగాలిస్తాను
నిస్వార్థంగా అన్నీ ఇచ్చే నన్ను చూడగానే
ప్రియురాలిని స్వయంగా మరొకరి 
శోభనం గదిలో పంపిస్తున్నట్టు  మొఖం పెడ్తావు
నా విలువ తెలిసి కూడ అలా చేస్తావు ..
నువ్వు భగ్నప్రేమికుడివని చాలా అవకాశాలు ఇస్తాను
కానీ విసిగిపోయానా  నిన్ను వరించకుండా ఆపడం నీ తరం కాదు
నన్నాపే ప్రయత్నం చేస్తే  కసిలో నిన్నింతగా హత్తుకుపోతానో
నా నుండి నిన్ను విడదీయడం ఇక ఎవరి తరం కాబోదు ...




Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

10 Comments

avatar

చివరి వాక్యాలు చాలాబాగున్నాయండి

Reply Delete
avatar

కునుకు తీయ్యమని రెప్పలె మొరపెట్టి బుజ్జగించినపుడు
కలల లోకానికి కలసి పయనిద్దాం అని అన్నపుడు
భావాలోచనల సుడులు మనసు లో తిరుగుతున్నపుడు
మెదిలే అలజడి ముసురుతున్నప్పుడు ఈ నిద్రే మనకు హాయినిస్తుంది

మీ కవిత ఆద్యంతము ఆసక్తికరంగా ఉన్నది మెహ్ది అలీ గారు. చదువుతుంటే ఎంతో హాయినిచ్చింది

కునుకు తీయ్యమని రెప్పలె మొరపెట్టి బుజ్జగించినపుడు
కలల లోకానికి కలసి పయనిద్దాం అని అన్నపుడు
భావాలోచనల సుడులు మనసు లో తిరుగుతున్నపుడు
మెదిలే అలజడి ముసురుతున్నప్పుడు ఈ నిద్రే మనకు హాయినిస్తుంది

మీ కవిత ఆద్యంతము ఆసక్తికరంగా ఉన్నది మెహ్ది అలీ గారు. చదువుతుంటే ఎంతో హాయినిచ్చింది
ఇది ముమ్మాటికి నిజం ... అలిసిపోయిన మనిషినైన, మనసునైన తనలో లీనం చేసి ఉత్సాహాన్ని ఉరకలు వేయించడం మాంచి కిటుకు .. ఔనౌను ఇది ఇంకా ఎవరి తరం కాదు !! :-)

Reply Delete
avatar

mehdi garu ..mee blog nu roju chustuntaanu ..naa comment meerenduko publish cheyaru . endukanedi naaku teliyadu .. idi kuda cheyapoyina paravaledu .. meeru chalaa baaga raastaaru ..mee anni kavitalu manasuku hattukuntaayi ..i kavita chadivaaka NIDRA pai kuda ila raayochha ani navvu vachhindi . manasuku ahlaadangaa kanipinchindi ..ilaanti marinni kavitalu mee nundi ashistu mee abhimaani ...MAHITA ..

Reply Delete
avatar

బాగున్నాయండి మీ నిద్రలేమి రాత్రుల పలుకులు.

Reply Delete
avatar

Excellent.... Excellent.... Excellent....

Reply Delete
avatar

ధన్యవాదాలు అండి

Reply Delete
avatar

Thank you ..Thank you ..Thank you

Reply Delete
avatar

అందమైన , అభినందనమైన మీ వ్యాఖ్యకు హృదయపూర్వక ధన్యవాదాలు ...మీలా వ్యాఖ్యానించాలంటే నాకు సాధ్యం కాదేమో

Reply Delete
avatar

మహిత గారు ..ముందుగా సారి .. నిజానికి మీదేదో నకిలీ ఐ డి అనుకోని నేను పట్టించుకోలేదు .. మీరు మాట్లాడాకా అర్థం అయింది . ఆకృతికి గారికి థాంక్స్ చెప్పాలి . .. నా కవితల పై మీ అభిప్రాయానికి ధన్యవాదాలు అండి .. మరొకసారి క్షమాపనలతో ...

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.