Followers

Saturday, August 24, 2013

thumbnail

!! నాదేమున్నది .. !? .... !!




ప్రశాంతంగా ఉన్న మనసులో 
అలజడి రేపిన పిలుపు నీదే 
మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలన్న
ఆసక్తి కలిగించిన చూపు నీదే

వసంతాల అనంతరం ఆహ్లాదం
కలిగించిన స్మరణం నీదే
వైరాగ్యంలో అనురాగం
వినిపించిన చరణం నీదే


అధరాలపై  లాస్యం
రప్పించిన హాస్యం నీదే
జీవితంపై అనురక్తి
కలిగించిన భాష్యం నీదే

కాసేపలా కలసి నడుద్దామని
సూచించిన ఆ రహదారి నీదే
పయనం ఎంతవరకనేది
చూపించిన ఆ గమ్యం నీదే

అలసి నిలబడిపోతే
నడిపించిన చేయూత నీదే
స్వేదం కారుతుంటే
ఆర్తిగా తుడిచిన సహృదయత నీదే

గమ్యం సమీపిస్తునప్పుడు
అకస్మాత్తుగా పెరిగిన వేగం నీదే
సమాంతరంగా నడవలేనప్పుడు
నెమ్మదిగా నను విడిచిన వేలు నీదే

నేను ఆగిపోయినపుడు
వెనక్కి చూడలేని నిర్ణయం నీదే
నువ్వు ముందుకు వెళ్లిపోయాక
నా పరిస్థితి పట్టించుకోని మౌనం నీదే

ఎప్పుడో వెనక్కి చూస్తావన్న
నాలో ఉన్న ఆశ నీదే
ఏనాటికైనా తిరిగివస్తావన్న
నాలో ఉన్న నమ్మకం నీదే ....




Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

10 Comments

avatar

Naa prati adugulo adugujaada neede
Naa prati kalala maatuna daagina bhaavam neede
Nee kosam ani paruguparuguna vachche hrudayam
Aa parugu vembadi munduku nette gunam neede...

Chaala Chakkaga Chepparu
Hats off Ali ji.. :)


Sridhar Bukya
http://kaavyaanjali.blogspot.in/

Reply Delete
avatar

స్వేదం కారుతుంటే
ఆర్తిగా తుడిచిన సహృదయత నీదే....
" ఎందుకో చెప్పలేను కానీ... మనసుకు తాకింది .. పొగడ్త కాదు కానీ మీ కవితల్లోని ఏదో ఒక వాక్యం మనసుకు బలంగా తాకుతుంది . గతాన్ని గుర్తుకు తెస్తుంది . బహుశ అందుకే మనసు ఇక్కడికి రప్పిస్తుంది .. "

Reply Delete
avatar

mehdi ali garu
mottaniki sarvam amede antaaru ..mari meedemundi ..????
\\\ anaamika ///

Reply Delete
avatar

Bukya Sridhar గారు .. చాల బాగా చెప్పారు . అభినందనలు .. మీ అభిమానానికి ధన్యవాదాలు

Reply Delete
avatar

ఆకృతి రెడ్డి గారు ... పొగడ్త కాదుగానీ మీ నిశిత దృష్టికి అభినందనలు . ఇలాంటి కవితలు నేనే కాదు ఎవరు రాసిన అలాగే అనిపిస్తాయి .. మన వెనకాల ఏదో ఒక ( అందమైన ) గతం ఉంటే ...

Reply Delete
avatar

adegaa annanu ..
analendi okate ..sarvam amede ..ame hrudyam maatram naade ..ok naa..anamika garu

Reply Delete
avatar

మీదేమున్నదిలే అనుకుని అన్నీ ఇచ్చి మనసుపారేసుకోకండి.....మెహిదిజీ :-)

Reply Delete
avatar

నిజమే నండి ..మీ సలహా కనీసం ఇక నుండైన పాటించాలి . ఎందుకు అమాయకంగా అన్నీ ఇస్తూ ఉండాలి .. ఇక నుండైన తీసుకొనే స్వార్థాన్ని పెంచుకోవాలి ... పద్మార్పిత గారు థాంక్స్ అండి ...:-)

THOKAR LAGNE SI HI TO AADMI GIRKAR SAMHAL TA HAI ..
WO PATHAR SE LAGE YA APNAU KI BAAT SE LAGE...

Reply Delete
avatar

Do Kadam To Sab Chal Lethe Hain Par, Zindagi Bhar Ka Saath Koi Nahi Nibhata, Agar Ro Kar Bhulai Jaati Yaadein,
Tho Hans Kar Koi Gham Na Chupathaa

Reply Delete
avatar
This comment has been removed by the author.

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.