నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదు
కేవలం ఇంతే ... నిన్న ఉన్న నాహృదయం స్థానంలో
నేడు గాయం ఉంది .. విషాద గేయం ఉంది
నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదు
కేవలం ఇంతే .. నా ఎదపై బాహ్యంగా ఉండేదానివి
ఇప్పుడు ఎదలో జ్ఞాపకంగా ఉంటున్నావు ...
నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదు
కేవలం ఇంతే.. నువ్వు నాటిన మల్లె పూలు
రాత్రుళ్లు మంచంపై ఉండేవి .... ఇప్పుడు రాలి నేలపై ..
నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదు
కేవలం ఇంతే..స్నానించిన నీ కురుల స్పర్శకు
మేలుకువ వచ్చేది .. ఇప్పుడు నిద్రే లేదు కంటిపై ..
నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదు
కేవలం ఇంతే ... వెళ్తుంటే ఎప్పుడొస్తారు అనే దానివి ..
ఎంత బాగుండేది .. ఉంటే నీ పిలుపు నిజమై....
నువ్వు లేకపోయిన ఇక్కడ ఏది మారలేదు
కేవలం ఇంతే నిన్నటి చదునైన స్థలంలో
నేడు ఒక నివాసం ఉంది .. అందమైన నీ సమాధి ఉంది ..

Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
ఇది మీ ప్రేమానురాగాల స్మృతికోటలా ఉంది.
Reply Deleteగతించిన ప్రేమానురాగాల కోట స్మృతిలా ....
Reply Delete