ఒకరిపై నిందలు
ఎందుకేస్తావు నేస్తమా
నీ అతి విశ్వాసంపై
నువ్వు సిగ్గు పడాలి గాని ....
ఎన్నిసార్లు నీ మనసు
హెచ్చరించలేదు
ఊహల్లో జీవించకూ
వాస్తవం చేదుగా ఉంటుందని...
అంతస్తులు
కట్టుకుంటూ పోయావు
పునాదెలా భరించగలదో
చూసుకోలేక పోయావు ....
కాలం ఎప్పటికీ ఆహ్లాదంగా
ఉంటుందని భ్రమించావు
కాలం మారడానికి ఎంతో సమయం
పడదని ఊహించుకోలేక
పోయావు......
నీ అంతరంగాన్ని
తన ఎదురుగా
నగ్నంగా
బహిర్గతం చేసావు
తను
ముసుగులో ఎందుకుంటుందో
ఏనాటికి
అర్థం చేసుకోలేక పోయావు .....
తన చూపులు నీపైనే
అని మురిసి పోయావు
దృష్టిలో ఉన్నావుగాని
దృశ్యంలో లేవని తెలుసుకోలేక పోయావు .....
అన్ని తెలిసాక కూడ
తనపై విరక్తి పడలేక పోతున్నావు
ఎందుకంటే తను ప్రేమించక పోయినా
నువ్వు మాత్రం ప్రేమించడం మానలేక
పోతున్నావు .....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
అంతేనండి....ఒక్కోసారి అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేము
Reply Deleteఎందుకంటే...ఇక్కడ మ్యాటర్ ఏంటంటే "మనసు మాట వినదు"
బాధ అదే కదా .. పరాయి వాళ్ళు ఎలాగో పరాయివాళ్లే .. నా అనుకున్న మనసు కూడా పరాయివాళ్ళ కోసమే స్పందిస్తుంది .. మీ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు ...
Reply Delete