Followers

Saturday, June 8, 2013

thumbnail

నీ అంతరంగం


నీ కంటే నాకే ఎక్కువ తెలుసు నీ అంతరంగం
ఏదో ఆకర్షణలకు , కల్లబొల్లి కబుర్లకు లోంగేది కాదని........
స్నేహంపై నీకోక నిర్ధిష్టమైన అభిప్రాయం ఉందని
అంత సులభంగా అది ఎవరిని స్వీకరించదని ....
పడిపోకుండా బలమైన ఆలంబన ఉంటే తప్ప
ఆకాశంలో విహరించాలని నువ్వు కోరుకోవని .....
నీ పరిధిలోనే విహరించాలనుకుంటావు తప్పా
ఒకరి హద్దుల్లో వెళ్లాలని నీకు అనిపించదని .....
ఒకరి కొసమో లేననురాగాన్ని
మాటల్లో , చూపుల్లో రప్పించడం నీకు రాదని ......
నీ  అంతరంగం నువ్వే  అల్లుకున్న పర్ణశాలని
ఎంతో అర్హత ఉంటే తప్ప అందులో ఎవరికి ప్రవేశం ఉండదని....
నీపై ఆసక్తి కలిగించే  ప్రయోగాలు చేయడం నీకు రాదని
నీపై అనురక్తి కలిగించే ప్రతి అంశాన్ని హద్దులో ఉంచుతావని.....
నీ స్నేహపు అర్హతకు ఒక కోలామానం ఉందని
అది తక్కువైన , మరీ ఎక్కువైన దూరం చేసేస్తావని......
అందుకే నన్ను దూరం చేసావని 

అర్థం చేసుకొనేగా దూరంగా ఉంది నీ మనసు నొప్పించకూడదని ...
 


 

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

6 Comments

avatar

స్త్రీ అంతరంగాని అర్థం చేసుకోవడం అంత సులభం కాదేమోనండి. మహా మహులే మతులుపోగొట్టుకున్నారు. మీ రచనాశైలి బాగుందండి.

Reply Delete
avatar

మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను అనికేత్ గారు .. స్నేహపూర్వకమైన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు

Reply Delete
avatar

అంతరంగాన్ని అలవోకగా చదివేసినట్లున్నారుగా :-) బాగుందండి.

Reply Delete
avatar

అసంఖ్యకంగా కోణాలుండే స్త్రీ అంతరంగపు ఏ ఒక్క కోణాన్ని నాటి నుండి నేటి వరకు ఎవరు చదివగలిగారని..నేనా సాహసం చేయగలను..? ... కానీ అణువంతైన నేను అర్థం చేసుకున్న ఓ ( నా ) నేస్తం అందమైన అంతరంగం ఇది ... అభిమానపూర్వకమైన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు Padmarpita garu

Reply Delete
avatar

పద్మార్పితగారి అభిమానా???? కష్టమే ఆమె అంతరంగం తెలుసుకోవడం ఆమెకే తప్ప ఇతరులకు అనితరసాధ్యం:-)

Reply Delete
avatar

సృజన గారు .. పద్మార్పిత గారి అందమైన కవితలను అభిమానించే వాళ్ళలో నేను ఒకరిని .. నిజమే ... ఆమె అంతరంగం తెలుసుకోవడం ఆమెకే తప్ప ఇతరులకు అనితరసాధ్యం

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.