Followers

Monday, May 6, 2013

thumbnail

ఆవేదన



నువ్వు కూడా 
ఎవరినైనా ప్రేమించాలి
ఆ ప్రేమ నిన్ను 
నిర్లక్ష్యం చేయాలి !!

ప్రతిక్షణం నువ్వా 
ప్రేమను జపించాలి
నీ పెదవులు 
మందహసానికై తపించాలి

నీ గుండె నిండా 
దుఖం నిండాలి  
స్వాంతన కలిగించే 
ప్రతీదీ దూరమవ్వాలి

నీ కన్నీరు 
జీవనదిలా ఉండాలి
తుడిచే చూపుడువేలు 
నీకు కరువవ్వాలి

నీది కూడా నాలాగే 
భగ్న ప్రేమ కావాలి
నేను పడుతున్న 
ఆవేదన నీకు తెలియాలి

                                                             





Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.