మనసులోని
భావాలను
బహిర్గతపరిచే శక్తి
నాకళ్ళల్లో ఉంది
నిరాశ ఏమిటంటే
నీతో చూపులనుకలిపే
అవకాశమే రాదు
ఎప్పుడో ఒకసారి నీ దృష్టి
మిణుగురులా
నాపై ప్రకాశిస్తు పోతుంది
ఆ లిప్తకాలంలో
విస్మయం తప్ప
విషయాన్నిప్రకటించే భావం
నాలో రాదు
హృదయం చెప్పమని
ప్రేరేపిస్తుంది
నాలుక తన హద్దును
దాటనంటుంది
పాళీ ఉంది
సిరా ఉంది
భావాలున్నాయి
సంధిగ్దం మాత్రం
ఇంకా సంధిగ్దంలోనే ఉంటుంది
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
nice.....
Reply Deleteధన్యవాదాలండి
Reply Delete