నువ్వు మరిచిపోతే
మరణం రాదు
ఆలాని .. కేవలం శ్వాసించడాన్నే
జీవితమనను
నాకేలాగో నీ స్మృతుల్లో
నిద్ర రాదు
నువ్ హాయిగా నిద్రపో
నా ఆలోచనలు నీకోస్తేగా !
నువ్ చేసిన గాయం
ఎవరికి కనిపించదు
ఇక లేపనం గురించి
ఎవరిని అడగను ?
అనుక్షణం నీ జ్ఞాపకాలు
నన్ను హింసిస్తూ ఉంటాయి
శిక్ష పూర్తి కావడమే లేదు
ప్రేమ .. ఇంత పెద్ద నేరమా ?
ఎలాగో తపిస్తూ ఉంది
ప్రేమించిన హృదయం
ఓసారి కనిపించి కనులకు
స్వాంతన కలిగించవా ! ?
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments