... ! ?
నా ఆధారాలా లాస్యం
దూరం చేసావు
నీ కళ్ళలో ఇంకా
విషాదమెందుకుంది ... ! ?
నా జీవితంలోని పున్నమిని
లాక్కున్నావు .
నీ జీవితం అమావాస్య
ఎందుకయింది ... ! ?
నా జీవితాన్ని
ఎడారి చేసావు
నీ కళ్లలో తడి
ఎందుకు ఆరకుంది ... ! ?
నా సర్వాన్ని
నిర్వీర్యం చేసావు
తీయని నీ స్వరమెందుకు
మూగబోయింది ... ! ?
నన్ను భగ్నప్రేమికుడి
మార్చావు
నీ జీవితం విరహినిలా
ఎందుకయింది ... ! ?
నా జీవిత వసంతాన్ని
దూరం చేసావు
నీ జీవితమెందుకు
శిశిరమైపోయింది ... ! ?
ఏదో పంతానికి
నన్ను వదిలావు
నువ్వెందుకు ఇంకా
ఒంటరిగానే మిగిలావు ... ! ?
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
4 Comments
నా జీవితాన్ని
ఎడారి చేసావు సరే …
నీ కళ్లలో తడి
ఎందుకు ఆరకుంది
nice sir
Wel come to my blog ...thanks swarna garu
Reply Delete"ఏ....వీ"
Reply Deleteతన తప్పిదమేమి లేదు..
నేనన్నాను నా బ్లాగ్ లో మన లేబల్ తొలగించనాయని
తన తప్పిదమేమి లేదు..
తన మనసు నొచ్చుకుని వుంటుందేమో మథనపడి
తన తప్పిదమేమి లేదు..
తన స్నేహితుడినై తననే అర్దం చేసుకోలేదేమో తొందరపడి
తానెక్కడున్నా బాగుండాలి..
మూడేళ్ళ నాలుగు నెలల తన స్నేహం..
నా జీవితంలో మరుపురాని స్నేహగీతరాగాంజలి
~సిరిహర్షశ్రీ~
Sridhar Bhai ..thanks for Excellent comment
Reply Delete