నిజమే .. నిన్ను ప్రేమిస్తుంటాను ....
నువ్వు నన్ను ప్రేమిచాలనుకోవడం భావ్యం కాదు కదా !!
నీతో కలసి స్వప్నంలో విహరిస్తుంటాను ....
బాహ్యంలో అలా జరగాలని కోరుకోవడం భావ్యం కాదు కదా !!
ఓ ప్రేమ గీతానికి చరణం గా ఉండాలనుకుంటాను ....
నువ్వు పల్లవిగా ఉండాలనుకోవడం భావ్యం కాదు కదా !!
నువ్వు రాసే కవితలకు ఇష్టపడుతుంటాను .....
నా కవితలు నువ్విష్ట పడాలనుకోవడం భావ్యం కాదు కదా !!
పథంలో నీకు తారసపడుతుంటాను..........
నాతో చూపులు కల్పాలనుకోవడం భావ్యం కాదు కదా !!
వెన్నెల్లో తడుస్తూ , కలసి నీతో నడుస్తూ ఉండాలనుకుంటాను
అసంభవమని తెలిసి ఆలోచించడం భావ్యం కాదు కదా !!
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
అలోచలకి అడ్డుకట్ట వేయడం కష్టం కదా...:-)
Reply Deleteపద్మార్పిత గారు నిజమే ... కానీ , ఎంత అడ్డు కట్ట వేసిన ఒక్కోసారి ఆలోచనల తీవ్రత ఎక్కువై కట్టలో పగుళ్లు వచ్చి ప్రహవించి పోతూనే ఉంటాయి .
Reply Delete