ఎందరో చెప్పారు నా హృదయం
రాయి కంటే కఠినమని
నిజమే అనుకొనేవాన్ని
నువ్వు ముక్కలు చేసేదాక !!
నీ కోసం ఏదైనా చేయగల
శక్తి నాలో ఉండేది ...
నాతో నేను గెలవలేనంతగా
నిర్వీర్యం చేసావు !!
నా శ్వాస ధ్వని నాకే వినిపిస్తుంది
ఇంతగా ఒంటరివాణ్ని చేసావు
ఎంతగా గాయాలు చేసావంటే
బాధ , బాధ తత్వాన్ని కోల్పోయింది !!
నా జీవన విస్తీర్ణం
ఇక మిగిలింది ఎంతని ... !?
నా నుండి నీ వరకు
నీ నుండి నా సమాధి వరకు !!
మరణం అంటే
ఇక ధైర్యం వచ్చేసింది
మర్చిపోయానని
చివరిసారిగా చెప్పేయి !!
నీ కోసం ఇంతగా
ఎదురుచూస్తానంటే ....
సమాధిలో వెళ్ళేవారకు
నా కనులు తెరిచే ఉంటాయి !!
నేను పోయాక
ఏదో ఒక కోరిక తీర్చాలనుకుంటే
మనం నాటిన మొక్క పుష్పించినపుడు ...
నా సమాధిని మర్చిపోవద్దు !!
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
No Comments