సమాజం
సమూహం లాంటిది
నడిస్తే సమాజంతో
పాటు నడవాలి
నాకంటూ ప్రత్యేకత
ఏదీ అనుకోని
సమూహం కంటే
ముందు నడిస్తే
ఒంటరిగా జీవించాలి
వద్దు అనుకోని
వెనుక నడిస్తే
సమూహం రేపే దుమ్ములో
ఉక్కిరిభిక్కిరి అవ్వాలి
అందుకే అందరిలో
ఒకరిగా ఉండాలి
తన స్వార్థం కోసమే కాక
ఇతరుల కోసం కూడా జీవించాలి
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
We have to be.
Reply Deleteyes.. we have to be
Reply Delete