కన్నుల్లో మమకారం
పెదవులపై తిరస్కారం
మనసుపై ముసుగేసిన
అనురాగాన్ని దాచిన
నీ కళ్లలోని ఆహ్వానం
చూపుతుంది అభిమానం
నా మనసును దోచావు
ప్రేమేందుకు దాస్తావు
మదిలోని భావాన్ని
ఆధారాలపై ఎందుకు తేలేవు ?
నీప్రేమను నేనేగా
సంశయమెల పడుతావు
హృదిలోని భావాన్ని
బహిర్గతమేప్పుడు చేస్తావు
దారులు నీకు ఎన్నున్నా
నా బాటలోకే వస్తావు
నీవెంట రాకుంటే
తిరిగేందుకు చూస్తావు
భయం వద్దు లోకంతో
మనసేందుకు దాస్తావు
నీడలా ఉంటాగా
తోడేందుకు రాలేవు
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
nice,,,,!!! andamaina prema ,, andarani prema..
Reply Deleteandi andakunda,, atadinche prema....
bahusha ..prema ante idenemo...
Reply Delete