ఏం చేసినా ,
ఎంత ఆలో ... చించినా ,
కొన్నిసార్లు మనసు
కవితా స్ఫూర్తి ఇవ్వలేక పోతుంది
ఎప్పుడో వస్తుంది
ఎందుకో వస్తుంది చెప్పలేను కానీ
ఏదో సందర్భంలో
ఏదో ఒక దృశ్యం ప్రేరణ ఇస్తుంది
ఎవరిదో వాక్కు
స్పందన కలిగిస్తుంది
ఏదైనా మంచి వాక్యం
స్ఫూర్తిని ఇస్తుంది
అప్పుడొక భావం అకస్మాత్తుగా
నా మనసులో ఉధ్భవిస్తుంది
రాయడానికదే ఉద్భోదిస్తుంది
అలా ఉధ్భవించే భావం
ఒక రూపాన్ని సంతరించుకుంటుంది
కలిగిన
స్ఫూర్తి , ప్రేరణ , స్పందనలపై
ఆ కవిత ఆధారపడి ఉంటుంది
దృశ్యం మనసును
చలింపచేస్తే
కవితలో ఆర్ద్రత కనిపిస్తుంది
స్పందన హృదయానికి
ఆహ్లాదాన్నిస్తే
కవితలో భావుకత ఉప్పొంగుతుంది
స్ఫూర్తి ఉద్వేగాన్ని రగిలిస్తే
కవితలో వాస్తవికత
తొణికిసలాడుతుంది
వీటినే ప్రామాణికంగా
నా కవిత తీసుకుంటుంది
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
ఆ ప్రేరణలతో మరిన్ని మంచి కవితలందించండి.
Reply Deleteపద్మార్పిత గారు ఆ ప్రేరణలే కాదు మీ అభిమాన పూర్వకమైన సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటాను
Reply Delete