Followers

Monday, May 6, 2013

thumbnail

సమాజం



అంత  గట్టిగా అరవకు
సమాజం గాఢ నిద్రలో ఉంది ....
 
మానభంగాలు , విధ్వంసాలు
ఏవైనా జరగనీ ....
నిర్లిప్తత దుప్పటి కప్పుకున్న
దానిలో చలనం రాదు
 
బాధితులు  భయంకరంగా అరుస్తుంటే  
కొన్నిసార్లు నిద్రాభంగమై
భారంగా కళ్ళు తెరుస్తుంది
కాసేపు అటూ ఇటూ చూసి
విశాల ప్రపంచంలో  మాత్రం జరగవా
సమర్థించుకొని ఆవులింత వేస్తుంది
 
నాల్గడుగుల దూరంలో 
జరిగే అరాచకాన్ని ఆపగలిగితే
 దూరం నలభై డుగుల దూరాన్ని
 ప్రభావితం చేస్తుందని దానికి తెలిసిన
నాదాకా రాలేదు కదా చూద్దాం అనుకుంటుంది
 
తల దాచుకోవడానికి  ఒకప్పుడు చోటులేనివాడు
నేడు సౌధాలు కడుతుంటే 
ఎంతమంది జీవితాలపై  పునాదులు లేపాడో 
దానికి ప్రశ్నించాలనిపించదు
  
ఎలాంటి స్థిరాస్తులు లేని
నాలుగంకెల జీతం వచ్చే ప్రభుత్వుద్యోగి
నాలుగొందల ఏకరాలకెలా  ఆసామి అయ్యాడో
అనుమానించాలని దానికి అన్పించదు
 
తమతో చావుదెబ్బలు తిని
నేడు ఖద్దర్ వేసుకొన్న వీధి రౌడీలకు
రక్షకులు  ఏదో ఆశించి సెల్యూట్లు కొడుతుంటే
పౌరులకు ఇచ్చే సందేశమిదేనా నిలదీయాలనిపించదు
 
దేవుడికి  కోట్లల్లో విరాళాలిచ్చే భక్తులకు
పేద ఆడపిల్లల వర  కట్నాల గురించి
విన్నవించాలని దానికి అనిపించదు
 
ఏదైనా జరగని తనదాకా వస్తేగాని
 బాధ తనకు తెలిస్తేగాని
బాధితుల్లో అధికులు మవాళ్లు ఉంటేగాని
దానికి హడావుడి చేయాలనిపించదు
 
అందుకే ...
అంత  గట్టిగా అరవకు
దానికి  చిరాకు పుడుతుంది
సమాజం గాఢ నిద్రలో ఉంది

                                  


Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.