Followers

Wednesday, May 8, 2013

thumbnail

( మీ ) ఇష్టం ! ……..


ఒకరి ఆసక్తి మరొకరికి
నిరాసక్తి   కలిగించినా   
దాన్ని అనురక్తి  గా
మార్చుకోగలిగే  స్నేహాన్ని  ఇష్టపడు 
 
ఆకాశంలో విహరించగలిగే
మనస్థైర్యం ఉన్నా  
పాదాల్ని భూమిపై 
నిలపడాన్నే ఇష్టపడు  
 
కృత్రిమంగా విరిసే
పూల సువాసన కన్నా
వర్షపు చినుకులకు
మట్టి వెదజల్లే సువాసన ఇష్టపడు
 
నీ కంటే పైవారి చేయూత
కోసం తపించడం కన్నా
క్రింది స్థాయి వారికి
చేయూతనివ్వడానికి ఇష్టపడు
 
మాటలతో ఆహ్వానిస్తూ నుదురు చిట్లించుకొనే
   పెద్దవారి   దగ్గరికి వెళ్ళడం కంటే
నీ చేరికతో  కళ్ళలో మెరుపు వచ్చే
  పేదవారి    దరి చేరడాన్నే ఇష్టపడు 

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

No Comments

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.