Followers

Sunday, May 12, 2013

thumbnail

త్యాగమయి




నీ పాదాల  క్రింద ఉన్న స్వర్గాన్ని
విధాత తీసుకోలిచాడు
దానికి బదులుగా ఏమైనా కోరుకో
అన్నాడు  దైవదూత మాతృమూర్తితో .... !!
ఇచ్చింది విధాతే ...  అడగకుండానే
తీసుకొమ్మను ... అంది చిరునవ్వుతో !!
విధాత అంతా స్వార్థపరుడు  కాదు
ఏదైనా తీసుకుంటే 
మరొకటి ఖచ్చితంగా ఇస్తాడు
ఏదైనా కోరుకో .....  !!
ది విని మాతృమూర్తి అంది దరహాసంతో
స్వర్గమే కాదు నా ఆయస్సు ను
కూడా తీసుకోమను . కానీ ,
నా సంతానం నుదుటిరాతను
స్వయంగా నేనే రాసే
అవకాశాన్ని ఇవ్వమను ... !!

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

4 Comments

avatar

తల్లి ప్రేమ మరి..
బాగుందండీ అలీ సార్..

Reply Delete
avatar

కెక్యూబ్ వర్మ గారు నా బ్లాగ్ లో మీ ఆగమనానికి హృదయపూర్వక స్వాగతం ... మీ అభిమాన పూర్వకమైన కామెంట్ కు ధన్యవాదాలు

Reply Delete
avatar

తల్లి ప్రేమలోని తడిని చల్లగా మనసుకు తాకేలా వ్రాసారు.

Reply Delete
avatar

Padma arpita gaaru ధన్యవాదాలు మీ అభిమాన పూర్వకమైన కామెంట్ కు ...

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.