Followers

Friday, May 17, 2013

thumbnail

నేర్చుకోని .... !!





 
మొదటి చూపులోనే
నీ స్నేహ హస్తాన్ని ఎలా కోరను ... ?
నీ దృష్టి పడగలిగే
స్థాయి నాకు రాని ..... !!
 
నీతో నిస్సంకోచంగా
ఎలా మాట్లాడను ... ?
ముందు నా  
అక్షరాభ్యాసం పూర్తికానీ .... !!
 
నీతో సమాంతరంగా
ఎలా నడవను ..... ... ?
తప్పటడుగుల
దశ నన్ను దాటని ..... !!
 
ఆకాశంలో విహరించే
స్వప్నాన్ని ఎలా చూడను ... ?
నేలపై పడిపోకుండా
ఏదైనా ఆధారం చూడని ..... !!
 
ప్రేమించాలనే భావన
ఎలా పెంచుకోను ... ?
ముందు ఒంటరితనపు
అలవాటు కాని ..... !! 

Subscribe by Email

Follow Updates Articles from This Blog via Email

2 Comments

avatar

బ్లాగ్ ను సందర్శించినదుకు కృతజ్ఞతలండి . కవితను మెచ్చినందుకు ధన్యవాదాలండి.

Reply Delete

Akshara Swasa by Mehdi Ali. Powered by Blogger.