మరణం కోసం సముద్రంలో మునిగాను
అలలు లాక్కొచ్చి తీరంలో పడేసాయి
నేను మళ్ళీ అలాగే చేసాను
అలలు మళ్ళీ అలాగే చేసాయి
నాకు మరణం కావాలి
అభ్యర్థనగా వాటిని అడిగాను
నీకోసం నీ తల్లి ప్రార్థిస్తుంది .
అందుకే మృత్యువు సైతం బెదురుతుంది
అలలు నిస్సహాయంగా అన్నాయి
వరం ఇస్తానన్న దేవుడితో
నా మరణాన్ని కోరాను
విన్నాక దేవుడు నాతో అన్నాడు
నీ దీర్ఘాయుస్సు గురించి నీ తల్లికి వరమిచ్చాను
అది పూర్తి అయ్యేవరకు నీకీ వరం ఇవ్వలేను
నేను కాలం చేశాక నన్ను స్వర్గానికి పంపించారు
నేనేన్నో పాపాలు చేశాను నాకు స్వర్గమేమిటి అడిగాను
దేవుడు అన్నాడు చిద్విలాసంగా
నీ కారణంగా నీ తల్లి ఏనాడూ కన్నీరు కార్చలేదు
ఆ ఒక్క అర్హత చాలు ఇక్కడ నీ ప్రవేశానికి .....
Subscribe by Email
Follow Updates Articles from This Blog via Email
2 Comments
చాలా బాగుంది
Reply Deletethanks admin gaaru
Reply Delete